English | Telugu

నా పెళ్లి నా ఇష్టం అని తేల్చేసిన హిమ‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొంత కాలంగా విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ గురువారం ఎలాంటి మ‌లుపులు తిర‌గ‌నుందో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు ఎపిసోడ్ లో నిరుప‌మ్, హిమ దగ్గ‌రికి వెళ్లి నాతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటే ఈ రోజు రేపు కార‌ణం చెబుతావ‌ని అనుకున్నాను. కానీ ఇలా వేరే వాళ్ల‌తో పెళ్లికి రెడీ అవుతావు అని అనుకోలేదు అంటాడు. నిజం చెప్పు హిమ న‌న్ను నువ్వు ప్రేమిస్తున్నావు క‌దా? అని మ‌రోసారి అడుగుతాడు నిరుప‌మ్‌. దీంతో కొంత అస‌హ‌నానికి గురైన హిమ నా పెళ్లి సంబంధం ఎందుకు చెడ‌గొట్టావ్.. నా పెళ్లి నా ఇష్టం అని నిల‌దీస్తుంది.

హిమ మాట‌ల‌కు నిరుప‌మ్ ఎమోష‌న‌ల్ అవుతాడు. ఆ త‌రువాత నేను చూపించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకో బావా అంటుంది హిమ‌. ఆ మాట‌ల‌కు ఆగ్ర‌హంతో ఊగిపోయిన నిరుప‌మ్ ఏం మాట్లాడుతున్నావ్ హిమ అంటూ ఫైర్ అవుతాడు. ఇలా ఇద్ద‌రు మాట్లాడుకుంటుండ‌గా నిరుప‌మ్ కి ఫోన్ రావ‌డంతో అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు. అదే స‌మ‌యంలో అక్క‌డికి శోభ ఎంట్రీ ఇస్తుంది. హిమ‌పై సీరియ‌స్ అవుతుంది. క‌ట్ చేస్తే జ్వాల‌, నిరుప‌మ్ క‌లిసి బ‌యటికి వెళ‌తారు. అది చూసిన శోభ కోపంతో ర‌గిలిపోతుంది.

ఇదిలా వుంటే ప్రేమ్ త‌న మ‌న‌స‌లో మాట‌ని హిమ‌కు చెప్పాల‌ని ఎదురుచూస్తుంటాడు. త‌న‌కు ఎలా చెప్పాలా? అని ర‌క ర‌కాలుగా ప్లాన్ లు వేస్తుంటాడు. క‌ట్ చేస్తే నిరుప‌మ్‌, జ్వాల క‌లిసి అనాధాశ్ర‌మానికి వెళ‌తారు. ఇదే స‌మ‌యంలో నిరుప‌మ్ కు స్వ‌ప్న ఫోన్ చేస్తుంది. ఎక్క‌డున్నావ్ అని ఆరాతీస్తుంది. ఆటోవాళ్ల‌తో నీకు స్నేహ‌మేంట్రా అంటూ ఆగ్ర‌హిస్తుంది. ఆ మాట‌ల‌కు చిర్రెత్తుకొచ్చిన నిరుప‌మ్ నాకు ఆటో వాళ్లంటే ఇష్ట‌మ‌ని చెప్పి షాకిస్తాడు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.