English | Telugu
పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన జబర్దస్త్ వినోద్
Updated : Jun 2, 2022
జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ బుల్లితెరకు పరిచయమయ్యారు. ఈ షో ద్వారా మంచి సక్సెస్ అందుకుని సినిమాల్లో చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే హోస్ట్ గా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ఈ జబర్దస్త్ షో స్టేజి ద్వారా పరిచయమైన ఒక కమెడియన్ వినోద్. లేడీ గెటప్స్ తో ప్రేక్షకులను మెస్మోరైజ్ చేసాడు. శారీ కట్టి స్కిట్ చేస్తే చాలు అచ్చంగా అమ్మాయేనా అన్నట్టుంటాడు. ఐతే ఇప్పుడు లేటెస్ట్ అప్ డేట్ ఏమిటి అంటే వినోద్ తండ్రి అయ్యాడు. ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చాడు. వినోద్ కన్నా కూడా వినోదినిగా చాలా ఫేమస్ అయ్యాడు.
కొంత కాలం క్రితం యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేసి వినోద్ తో వినోదం పేరుతో వీడియోస్ అప్ లోడ్ చేస్తున్నాడు. ఇందులో తన ఫస్ట్ వీడియొలో అత్త కూతురు విజయలక్ష్మి వివాహం చేసుకుని తనని పరిచయం చేసాడు. ఇప్పుడు ఒక ఆడబిడ్డకు తండ్రిని ఆయనంటూ ఒక ఎమోషనల్ వీడియొ అప్ లోడ్ చేసాడు. సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అయ్యేసరికి నెటిజన్లు అంత వినోద్ కి విషెస్ చెప్తున్నారు.