English | Telugu

అది సూసైడ్ అటెంప్ట్ లాంటిది.. చిరంజీవి సెక్యూరిటీ నాతో చెప్పిన మాటకు...

మహేష్ విట్టా తెలుగువన్ ఫన్ బకెట్ వీడియోస్ తో మంచి పేరు సంపాదించుకున్నాడు ఇండస్ట్రీలో. ఆ తర్వాత బిగ్ బాస్ కి వెళ్ళాడు. అలాగే కొన్ని మూవీస్ లో కూడా నటించాడు. అలాంటి మహేష్ విట్టా ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించి ఎన్నో విషయాలను చెప్పుకొచ్చాడు.

"బిగ్ బాస్ నాకు చాలా నేర్పించింది. ఒకణ్ణి నమ్మి ఒక ప్రాజెక్ట్ మొత్తం చేతిలో పెడితే.. హార్డ్ డిస్కులు ఎత్తుకుపోయి నాకు డబ్బులు ఇస్తేనే తిరిగి ఇస్తా అంటూ నన్నే రివర్స్ లో బ్లాక్ మెయిల్ చేసాడు. నేను కొట్టాలనుకుంటే కొట్టొచ్చు నేను వెళ్లి. కానీ అప్పటికే వాడి హార్ట్ కి స్టంట్ పడింది. వాడికి ఏమన్నా ఐతే వాడి పేరెంట్స్ ని తర్వాత నేనేం చెప్పుకోవాలి అని వాడిని వదిలేసి మళ్ళీ డబ్బులు పెట్టుకుని నేనే ప్రాజెక్ట్ పూర్తి చేసుకున్నా. ఈ తత్వం నాకు బిగ్ బాస్ నేర్పించింది.

బిఫోర్ బిగ్ బాస్ ఐతే నేను వెళ్లి వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టేవాడిని. కానీ బిగ్ బాస్ తర్వాత నేను ఒకటి నేర్చుకున్నా. ఓకే కూల్ ఆ పెంటను ఇంట్లోకి తెచ్చుకోకూడదు అని తెలిసింది. బిగ్ బాస్ నాకు ప్లస్ అయ్యింది. అప్పటివరకు నేను కామెడీ రోల్స్ చేసుకుంటూ ఉండేవాడిని.. అప్పుడప్పుడే ఎదుగుతున్న. అదంతా వదిలేసి బిగ్ బాస్ వెళ్లాను. ఒకరకంగా అది సూసైడ్ అటెంప్ట్ లాంటిదే. నేను ఆడియన్స్ కి నచ్చుతాను అంటూ చాలామంది చెప్పారు. రెండు వారాలు ఉంటే చాలు అనుకున్నా. ఏది అనుకుంటే అది ఆ టైములో ఐపోవాలి అనే టైపులో ఉండేవాడిని బిగ్ బాస్ కి వెళ్ళకముందు వరకు. కానీ బిగ్ బాస్ కి వెళ్ళాక తెలిసింది ఆ టైం వచ్చే వరకు వెయిట్ చేయడమే అని.

బిగ్ బాస్ లో మర్చిపోలేని మెమరీ అంటే ఫినాలే టైంలో చిరంజీవి గారు నన్ను పొగడడమే. అప్పుడనిపించింది ఇండస్ట్రీకి దేవుడు అనుకునే వ్యక్తి నన్ను పొగిడారు అది చాలు అనిపించింది. ఇండస్ట్రీ మొత్తం ఒక సైడ్ నేనొక సైడ్ అన్నట్టు అనిపించింది. చిరంజీవి గారు మీ వీడియోస్ చూస్తూ ఉంటారు అని ఆయన సెక్యూరిటీ వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు. అంటే చిరంజీవి గారి కంట్లో మా రిఫ్లెక్షన్ పడుతోంది అది చాలు అనిపించింది. కానీ ఆయన బిగ్ బాస్ కి వచ్చి మహేష్ యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే సరికి చాలా హ్యాపీ అనిపించింది" అంటూ మహేష్ విట్టా చెప్పుకొచ్చాడు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.