English | Telugu

Bigg Boss 9: ఇమ్మాన్యుయేల్ కి గోల్డ్ స్టార్.. తన లవ్ స్టోరీకి నాగార్జున ఫిదా!

బిగ్ బాస్ సీజన్-9 అప్పుడే నాలుగో వీకెండ్ కి వచ్చేసింది. శనివారం ఎపిసోడ్ లో హౌస్ లో జరిగిన సంఘటనలకి నాగార్జున కంటెస్టెంట్స్ కి కోటింగ్ ఇచ్చాడు. ఈ వారం పర్ఫామెన్స్ బాగా ఉన్నవాళ్ళకి గోల్డ్ స్టార్.. యావరేజ్ పర్ఫామెన్స్ ఉన్నవాళ్ళకి సిల్వర్ స్టార్.. పూర్ పర్ఫామెన్స్ ఉన్నవాళ్ళకి బ్లాక్ స్టార్ ఇచ్చాడు నాగార్జున.

ఇమ్మాన్యుయేల్ కి గోల్డ్ స్టార్ ఇచ్చారు. అల్ రౌండర్ ఇన్ ది బిగ్ బాస్ హౌస్.. నవ్విస్తావు.. ఆడుతావ్.. కరెక్ట్ మాట్లాడుతావని ఇమ్మాన్యుయేల్ ని నాగార్జున మెచ్చుకుంటాడు. నీ లవ్ స్టోరీ వింటే చాలా హార్ట్ టచింగ్ గా ఉంది.. నీ లవ్ లో జెన్యూన్ ఉంది కాబట్టి అక్కడున్న నువ్వు మిస్ అవుతున్నావని నాగార్జున అంటాడు. అవును సర్ చాలా గుర్తొస్తుంది. ప్లీజ్ ఒకసారి తను ఎలా ఉందో చెప్పండి సర్ అని ఇమ్మాన్యుయేల్ అడుగుతాడు.

బిగ్ బాస్ లో ఉన్న నిన్ను, యూఎస్ లో ఉన్నవాళ్ళు కూడా చూస్తున్నారు. దానికి తోడు ఇక్కడ ఉన్నవాళ్ళతో బిగ్ బాస్ గురించి డిస్కషన్ కూడా జరుగుతుందని నాగార్జున చెప్తాడు. నాలుగు వారాలలో ఆల్ రౌండర్ ఇమ్మాన్యుయల్ అనేది కరెక్ట్ నిర్ణయం. గోల్డ్ వచ్చిందని ఆగిపోకుండా ఇంకా ముందుకి సాగాలని నాగార్జున చెప్తాడు. హౌస్ లో ఉన్న పదమూడు మందిలో ఒక్క ఇమ్మాన్యుయేల్ కి మాత్రమే గోల్డ్ స్టార్ వచ్చింది.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.