English | Telugu
`కార్తీక దీపం` షాకింగ్ ట్విస్ట్ అదిరింది
Updated : Nov 15, 2021
దేశ వ్యాప్తంగా నంబర్ వన్ సీరియల్‌గా పేరు తెచ్చుకున్న ధారావాహిక `కార్తీక దీపం`. రేటింగ్ విషయంలోనూ సంచలనం సృష్టించిన కార్తీక దీపం గత కొన్ని రోజులుగా చిత్ర విచిత్రమైన మలుపులతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తోంది. డాక్టర్ బాబు - దీపా కలవడం.. మోనిత జైలుకి వెళ్లడంతో ఎండ్ కార్డ్ పడాల్సిన ఈ సీరియల్‌ని బత్తాయి రసంలా పిండేస్తూ దర్శకుడు కాపుగంటి రాజేంద్ర సాగదీస్తున్నారు.
దీంతో అమితంగా అభిమానించిన ప్రేక్షకులు ఈ సీరియల్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ సీరియల్ రేటింగ్ కూడా దారుణంగా పడిపోవడంతో ఇప్పటికైనా ఈ సీరియల్‌ని ఆపేయడం బెటరనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే ఈ సోమవారం ఎపిసోడ్ కు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు దర్శకుడు కాపుగంటి రాజేంద్ర. దీంతో ఆడియన్స్ కి మైండ్ బ్లాంక్ అయిపోయింది. 1197వ ఎపిసోడ్‌లోకి ఎంటరైన ఈ సీరియల్ అదిరిపోయే ట్విస్ట్‌తో సరికొత్త మలుపు తిరిగింది.
మోనితకు పుట్టిన కొడుకు పేగు మెడలో వేసుకుని పుట్టాడని.. దాని వల్ల తండ్రికి ప్రాణగండమని తెలియడంతో కార్తీక్ తల్లి మోనితతో కలిసి ప్రత్యేకంగా పూజలు చేయిస్తుంది. అయితే దీని వెనక డాక్టర్ భారతి చెప్పిన ఓ అబద్ధం కారణమని తెలియడం ప్రేక్షకులని షాక్‌కు గురిచేస్తోంది. ఇన్ని ట్విస్ట్‌ల మధ్య ఇదేం ట్విస్ట్ అంటూ తల బాదుకుంటున్నారు. కట్ చేస్తే నా వంటకు ఎన్ని మార్కులు వేస్తావని దీప డాక్టర్ బాబుని అడుగుతుంది. దానికి పదికి పది అని చెబుతాడు. దానికి దీప మీరు అన్నీ అబద్ధాలే చెబుతున్నారంటుంది. ఆ తరువాత ఏం జరిగింది? .. కార్తీక దీపంలో సోమవారం ఎలాంటి ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిదే.