English | Telugu

Karthika Deepam2 : రిసెప్షన్ కోసం విశ్వప్రయత్నం.. నచ్చదంటూ దీప పంతం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -194 లో.....దీపని రిసెప్షన్ కి ఎలా ఒప్పించాలని శౌర్య ఆలోచిస్తుంది. పక్కనే కాంచన అనసూయ ఇద్దరు ఉంటారు. శౌర్యకి చాక్లెట్ ఇస్తూ.. ఇప్పుడు ఆలోచన వచ్చిందా అంటూ కాంచన అడుగుతుంది. రెండు, మూడు చాక్లెట్ లు ఇవ్వగానే ఐడియా వచ్చిందంటూ దీప దగ్గరికి శౌర్యా వెళ్లి.. మా ఫ్రెండ్స్ అందరికి నాన్నని పరిచయం చేయాలి కదా అందుకే మీరు రిసెప్షన్ చేసుకోండి అని శౌర్య అంటుంది. దాంతో శౌర్యపై కోప్పడి పంపిస్తుంది దీప. అప్పుడు కాంచన అనసూయ ఇద్దరు వచ్చి అది అన్న దాంట్లో తప్పేముందని అంటారు.

అప్పుడు కార్తీక్ బాబు ఫ్రెండ్స్ ఏమన్నారో మర్చిపోయారా.. అప్పుడు ఇద్దరే అన్నారు రిసెప్షన్ చేస్తే అందరు అంటారని దీప అంటుంది. ఆ తర్వాత ఎలాగైనా రిసెప్షన్ కి దీపని మనమే ఒప్పించాలని అనసూయ, కాంచన లు అనుకుంటారు. మరుసటి రోజు ఉదయం కార్తీక్ వాకింగ్ కి వెళ్తాడు. అక్కడ డాక్టర్ తో శౌర్య గురించి మాట్లాడతాడు. రిపోర్ట్స్ రావడానికి టైమ్ పడుతుంది కానీ శౌర్య హ్యాపీగా ఉండేలా చూసుకోండి అని డాక్టర్ చెప్తాడు. ఆ తర్వాత పారిజాతం, జ్యోత్స్న ఇద్దరు దీపతో మాట్లాడడానికి వస్తారు. లోపలికి వెళ్తే గొడవ అవుతుందని దీపకి పారిజాతం ఫోన్ చేస్తుంది. శౌర్యా లిఫ్ట్ చేసి దీపకి ఇస్తుంది. బయటే ఉన్నాం.. మాట్లాడాలి రా అని పారిజాతం అనగానే దీప బయటకు వస్తుంది.

దీప పొగరుగా మాట్లాడుతుంటే మెడలో తాళి పడేసరికి వంటమనిషి కాస్త ఇంటిమనిషి అయింది. ఇంకేంటి రిసెప్షన్ కూడా చేసుకుంటున్నావ్.. కాపురం కూడా చెయ్ అంటు జ్యోత్స్న అనగానే.. కొడితే గేట్ ముందు పడతావంటూ దీప అంటుంది‌. నా మనవరాలిని అంటావా అని పారిజాతం అనగానే.. మిమ్మల్ని కూడా అంటానని దీప అంటుంది. నేను రిసెప్షన్ చేసుకుంటున్నానని ఎవరు చెప్పారు. నాకు ఇష్టం లేదు. ఇదంతా భరిస్తుంది నా కూతురు కోసం మాత్రమే అని దీప అంటుంది. ఆ తర్వాత జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు ఇంటికి వెళ్లి మాట్లాడుకుంటారు. వాళ్ళని సంతోషంగా ఉండనివ్వొద్దని జ్యోత్స్న అనగానే అప్పుడే సుమిత్ర వచ్చి.. ఎక్కడికి వెళ్లారని అంటుంది. దీప దగ్గరికి రిసెప్షన్ వద్దని చెప్పడానికి అని జ్యోత్స్న అంటుంది. వాళ్ళు ఇప్పుడు భార్యాభర్తలని సుమిత్ర అంటుంది. కాదు ఇప్పుడు బావ నా భర్త.. వాళ్ళది పెళ్లి కాదని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.