English | Telugu

హౌస్ అంతా నబీల్ కే సపోర్ట్.. గంగవ్వ మాత్రం!

బిగ్ బాస్ సీజన్-8 అప్పుడే పదో వారంలోకి అడుగుపెట్టింది. ట్విస్టులు రోజు రోజుకి మాములుగా ఉండడం లేదు. నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ మూడు సూట్ కేసు లు పెట్టి ఎవరు నన్ను పట్టుకుంటారని సూట్ కేసు పై రాసి ఉంచారు. మొదట ఎవరు ఆ సూట్ కేసుని పట్టుకొనే దైర్యం చెయ్యలేదు. కానీ ముగ్గురు మాత్రం ముందుకు వచ్చారు. మిగతా హౌస్ మేట్స్ అందరు కూడా వాళ్ళకి ఏదో ఫిట్టింగ్ ఉంటుందని సంబరపడిపోతుంటారు. కానీ ఆ ముగ్గురిని డైరెక్ట్ గా మెగా చీఫ్ కంటెండర్స్ గా అనౌన్స్ చేసాడు బిగ్ బాస్.

దాంతో సూట్ కేసులు తీసుకున్న పృథ్వీ, నబీల్, రోహిణి ఫుల్ ఖుషి కానీ మిగతా హౌస్ మేట్స్ మొహాలు మాత్రం మాడిపోయాయి. ఆ తర్వాత గేమ్ మొదలైంది. సూట్ కేసు తీసుకున్న వాళ్ళు కాకుండా సమయానుసరం బజర్ మోగగా ఒక టాస్క్ జరుగుతుంది. అక్కడ ఓ గంట ఉంది. దానిని ముందు వెళ్లి పట్టుకున్న వాళ్ళు సూట్ కేసు పట్టుకున్న వాళ్ళ తో పోటీ పడాలని బిగ్ బాస్ చెప్తాడు. అలా మొదటగా రోహిణితో హరితేజ పోటీపడగా రోహిణి విన్ అవుతుంది. సూట్ కేసు లో ఉన్నా అమౌంట్ ప్రైజ్ మనీకి ఆడ్ అవుతుంది. దానితో పాటుగా రోహిణి మెగా చీఫ్ కంటెండర్ అవ్వడంతో పాటు సూట్ కేసు ప్రేరణకి ఇచ్చి డైరెక్ట్ మెగా చీఫ్ కంటెండర్ ని చేస్తుంది.

అలా సెకెండ్ టాస్క్ లో గౌతమ్ గంట పట్టుకొని నబీల్ ని సెలక్ట్ చేసుకుంటాడు. ఒక గంగవ్వ తప్ప అందరూ కూడ నబీల్ కి సపోర్ట్ చేస్తుంటారు. గేమ్ ఆడుతూనే నాకు ఎవరైన సపోర్ట్ చెయ్యండి అంటూ గౌతమ్ అడుగుతాడు. ఆ గేమ్ లో నబీల్ గెలుస్తాడు. తన సూట్ కేసు లోని అమౌంట్ ప్రైజ్ మనీకి ఆడ్ అవుతుంది. నబీల్ మెగా చీఫ్ కంటెండర్ అవుతాడు. అలాగే తన సూట్ కేసు యష్మీ కి ఇచ్చి.. తనని మెగా చీఫ్ కంటెండర్ ని చేస్తాడు నబీల్. కాసేపటికి గంగవ్వ దగ్గరికి గౌతమ్ వెళ్లి మాట్లాడతాడు. అందరు నబీల్ కే సపోర్ట్ చేశారు కానీ నా సపోర్ట్ నీకే అని గంగవ్వ అంటుంది. నాకు నువ్వు ఉంటే చాలు.. ఎవరు సపోర్ట్ చేయకున్నా పర్వాలేదు. ఇంకా బిగ్ బాస్ చాలా అవకాశం ఇస్తాడని గంగవ్వతో గౌతమ్ చెప్తాడు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.