English | Telugu
బిగ్ బాస్ హోస్ట్ గా తప్పుకుంటున్నా...
Updated : Aug 6, 2024
బిగ్ బాస్ షోకి ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. హిందీ, తెలుగు, తమిళ్ ఇలా అన్ని భాషల్లోనూ ఈ షోకి ఎందరో అభిమానులున్నారు. స్టార్ హీరోలు ఈ షోకి హోస్ట్ గా చేయడంతో ప్రేక్షకులకు మరింత చేరువైంది. హిందీలో సల్మాన్ ఖాన్, తెలుగులో నాగార్జున, తమిళ్ లో కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా కమల్, తమిళ బిగ్ బాస్ హోస్ట్ గా తప్పుకుంటున్నట్లు ప్రకటించి షాకిచ్చారు. (Bigg Boss Tamil)
ఏడేళ్ల క్రితం మొదలైన బిగ్ బాస్ ప్రయాణం నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ఒక నోట్ ని విడుదల చేశారు కమల్. సినిమాల కమిట్ మెంట్స్ వల్ల, రాబోయే సీజన్ కి హోస్ట్ చేయలేకపోతున్నానని తెలిపారు. ఈ షో కొత్త అనుభూతిని ఇవ్వడమే కాకుండా, మరింత మందికి చేరువ చేసిందని అన్నారు. ఈ అవకాశమిచ్చిన విజయ్ టీవీకి ధన్యవాదాలు తెలిపిన కమల్ హాసన్.. రాబోయే బిగ్ బాస్ సీజన్ కూడా బిగ్ సక్సెస్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.