English | Telugu
Brahmamudi : అనామిక ప్లాన్ ఫలించింది.. కళ్యాణ్ ఎంట్రీతో కొత్త మలుపు!
Updated : Aug 7, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi ).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-481 లో... అప్పుని అనామిక కిడ్నాప్ చేస్తుంది. నువ్వు పెళ్లి మండపంలో లేకపోయేసరికి అందరు నేను చేసిన నిందనే నిజం అనుకొని నమ్ముతారు. ఇప్పటికే రుద్రాణి తన మాటలతో టార్చర్ మొదలు పెడుతుంటుందని అనామిక అంటుంది. ఇప్పుడు ఇలా చేసి ఏం సాధించావని అప్పు అంటుంది. నా జీవితం ఇలా కావడానికి కారణం మీరే.. నిన్ను ఆ కళ్యాణ్ ని వదిలి పెట్టనని అనామిక అంటుంది.
ఆ తర్వాత రాజ్ , కావ్యలు గుడిలో అప్పు కోసం వెతుకుతుంటారు. ఎక్కడా కన్పించకపోయేసరికి రాజ్ SI కి కాల్ చేసి అప్పు కన్పించడం లేదని చెప్తాడు. దాంతో మేమ్ చూసుకుంటామని అతను అంటాడు. మరొకవైపు కళ్యాణ్ వస్తుంటే.. దార్లో బంటి పాడైపోయి ఉంటాడు. అతన్ని చూసి ఏమైంది అని అడుగగా.. అప్పు అక్కని కిడ్నాప్ చేశారని జరిగిందంతా బంటు చెప్తాడు. ఏంటి అప్పుని అనామిక కిడ్నాప్ చేసిందా అని కళ్యాణ్ షాక్ అవుతాడు. ఇప్పుడు అక్క పెళ్లి మండపంలో లేకుంటే ఎంత గొడవ జరుగుతుందో నువ్వే ఏదో ఒకటి చేసి అప్పుని కాపాడమని బంటి కళ్యాణ్ ని రిక్వెస్ట్ చేస్తాడు.ఆ తర్వాత రాజ్ కావ్య కనకం దగ్గరికి వస్తారు. పెళ్లి జరిపించి వచ్చారా అంటూ ధాన్యలక్ష్మి అంటుంది. అవును కళ్యాణ్ గానీ ఒప్పుకుంటే ఈ పాటికి పెళ్లి చేసి హనీమున్ కి పంపేవాడినని రాజ్ అనగానే.. ధాన్యలక్ష్మి కోప్పడుతుంది. ఏంటి నా కొడుకు పైకి నోరు లేస్తుందని అపర్ణ అనగానే.. ఇది నా కొడుకు జీవితమంటూ ధాన్యలక్ష్మి అంటుంది. ఆ తర్వాత పెళ్లి కొడుకు నాకు ఇక ఈ పెళ్లి ఇష్టం లేదంటూ వెళ్లిపోతాడు.
ఆ తర్వాత పెళ్లికి వచ్చిన వాళ్ళు అందరు అప్పు గురించి తప్పుగా మాట్లాడుతూ వెళ్ళిపోతారు. కాసేపటికి రుద్రాణి, ధాన్యలక్ష్మిపై ఇందిరాదేవి ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదంటూ కోప్పడుతుంది. నీ కొడుకు ఎంత మందితో తిరిగాడో అందరికి తెలుసంటూ రుద్రాణితో ఇందిరాదేవి అంటుంది. తరువాయి భాగంలో ఇక పెళ్లి వద్దంటు వెళ్లిపోయారంట పాపమని అప్పుతో అనామిక అంటుంది. మూడవదాన్ని కూడా అంటకడితేనే లెక్క సరిపోతుందని ప్లాన్ వేసిందని రుద్రాణి అనగానే.. స్టాపిట్ అంటూ కళ్యాణ్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.