English | Telugu
Jayam serial : వీరు ప్లాన్ జస్ట్ మిస్.. రుద్ర కనిపెడతాడా!
Updated : Oct 7, 2025
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -77 లో.....గంగ నర్స్ గెటప్ లో వచ్చి రుద్రని కలుస్తుంది. చిట్టి ఎక్కడ అని రుద్ర అడుగగా.. ఇక్కడ ఎందుకు ఉంటుంది. స్కూల్ లో ఉంటుంది కదా అని గంగ అంటుంది. జోక్ చేయకు.. చిట్టి వాళ్ళ మేడమ్ ని ఎవరో కొట్టారట బెదిరించారట.. తను నాకు ఫోన్ చేసి రమ్మందని రుద్ర అంటాడు. అయ్యో నాకు తెలియదే ఇప్పుడు తెలియదని చెప్తే ఏమైనా అంటారేమో అని గంగ అనుకుంటుంది. ఆ తర్వాత కవర్ చేసి గంగ వెళ్ళిపోతుంది.
ఇక రుద్ర ఏం చేస్తాడని గంగ పక్కకి దాక్కుని అతడినే చూస్తుంది. చిట్టిని రుద్ర కలిసి మాట్లాడుతాడు. నిన్ను ఎవరు బెదిరించారు చెప్పమని అడుగుతాడు. ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుందని చిట్టి అంటుంది. మరొకవైపు హాస్పిటల్ లో కోమాలో ఉన్న వీరు తమ్ముడిని తీసుకొని వెళ్లడనికి మాస్క్ పెట్టుకొని ఒకతను వస్తాడు. అది సీసీటీవీ ద్వారా సూర్య చూస్తాడు. ఆ తర్వాత చిట్టీతో గొడవపడ్డ పారుని చిట్టి వెనకాల నుండి చూస్తుంది. అక్కడ ఉందని రుద్రని తీసుకొని వెళ్తుంది.. ఇక అక్కడికి వెళ్ళేలోపే పారు అక్కడ నుండి వెళ్తుంది. దాంతో చిట్టి డిస్సపాయింట్ అవుతుంది. పారుని వాళ్ళ అన్నయ్య అక్కడ నుండి తీసుకొని వెళ్తాడు. నువ్వు కాబోయే ఛాంపియన్ వి ఇలా చేస్తావా.. రుద్ర ఇలా చేసాడని సక్సెస్ లేదని వదిలేసావ్.. ఇప్పుడు నువ్వు సక్సెస్ ని వదులుకుంటావా అని తనని అక్కడ నుండి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత పారు వెళ్తుంటే గంగ చూసి చిట్టి వాళ్ళతో గొడవ పడ్డది అదేనేమో.. ఆ పారు ఇది ఒకతే అయి ఉంటుందా.. అందుకే రుద్ర సర్ ని చూసి వెళ్ళిపోయి ఉంటుందా అని గంగ తనలో తనే కన్ఫ్యూషన్ అవుతుంది.
గంగని ఫాలో అవుతున్న ఇషిక అంతా వీడియో తీసి.. నువ్వు ఇలా మోసం చేస్తున్న విషయం అందరికి చెప్తాననుకుంటుంది. మరొకవైపు చిట్టి తో రుద్ర మాట్లాడుతాడు. నీ ఫ్రెండ్ స్వీటీ కూడా వచ్చింది కదా అని రుద్ర అనగానే తన పేరు గంగ అని చెప్పేలోపు రుద్రకి సూర్య ఫోన్ చేసి హాస్పిటల్ లో ఉన్న ఆతన్ని తీసుకొని వెళ్తున్నారు. వీరు ప్రీతీ అక్కడే ఉన్నారని సూర్య చెప్తాడు. వెంటనే వీరుకి రుద్ర కాల్ చేసి అతన్ని అడ్డుకోమ్మంటాడు. వీరు అతన్ని అడ్డుకున్నట్టు యాక్ట్ చేస్తు వెళ్ళిపోమంటాడు. రౌడీ అతన్ని తీసుకొని వెళ్తాడు. అప్పుడే రుద్ర వస్తాడు. ఏంటి మీరు.. మీకు ఏమైనా అయితే రుద్ర అన్నయ్య ఇలాగే చేస్తాడని వీరుతో ప్రీతి అంటుంది. మీరు వెళ్ళండి నేను అతని కార్ నెంబర్ చూసా పట్టుకోవడానికి ట్రై చేస్తానని రుద్ర అనగానే వద్దు రిస్క్ ఎందుకని వీరు, ప్రీతి అనడంతో సరే అని రుద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.