English | Telugu

Illu illalu pillalu : చందు నిజం చెప్పేస్తాడేమోనని హార్ట్ ఎటాక్ డ్రామా ఆడిన భాగ్యం దంపతులు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -282 లో.... శ్రీవల్లిని ప్రేమ ఒక ఆట అడేసుకుంటుంది. గాజు పెంకులపై డ్యాన్స్ చేయిస్తుంది. దాంతో ప్రేమ అంటే శ్రీవల్లికి భయం వేస్తుంది. మరుసటి రోజు శ్రీవల్లి కాలికి గాజు పెంకులు గుజ్జుకున్నాయని ఏడుస్తుంటే నర్మద వచ్చి ఏమైందని అడుగుతుంది. ఆ తర్వాత ప్రేమ నిద్ర లేచి.. రాత్రి జరిగింది గుర్తుచేసుకుంటుంది. ధీరజ్ వచ్చి నా డ్రెస్ ఎక్కడ అని అడుగుతాడు. నాకేం తెలుసు.. మీ ఐశ్వర్యకి తెలుసని వెటకారంగా మాట్లాడుతుంది.

ఆ తర్వాత కాలికి ఏమైందంటే సైలెంట్ గా ఉన్నావని శ్రీవల్లిని నర్మద అడుగుతుంది. ఇప్పుడు ప్రేమ ఇలా చేసిందని చెప్తే మళ్ళీ ప్రేమని అడుగుతుంది. ఇంకా నాపై కోపం పెంచుకుంటుందిని.. ఏం లేదు.. నేను చూసుకోకుండా గాజు పెంకపై అడుగుపెట్టానని శ్రీవల్లి చెప్తుంది. ఆ తర్వాత భాగ్యం ఆనందరావు ఇంటికి వస్తారు. ఇప్పుడు చెప్పండి మీరు డబ్బు ఎందుకు మావాడిని అడిగారని భాగ్యం వాళ్ళని రామరాజు అడుగుతాడు. మేం అడగలేదు మేం అమ్మాయితో మాట్లాడుతుంటే విని అతనే ఇచ్చాడని భాగ్యం అంటుంది.

నిజమేనా అసలేం జరిగిందని చందుని రామరాజు అడుగుతాడు. ఎక్కడ నిజం చెప్పేస్తాడోనని ఆనందరావు హార్ట్ ఎటాక్ వచ్చినట్లు యాక్టింగ్ చేస్తాడు. భాగ్యం తనని తీసుకొని ఆటోలో వెళ్తుంది. బాగా ప్లాన్ చేశామని ఇద్దరు నవ్వుకుంటారు. ఎదురుగా నర్మద ఉంటుంది. తరువాయి భాగంలో ముగ్గురు కోడళ్ళు బతుకమ్మ పేరుస్తారు. ఎవరిది బాగుందని అడుగుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...