English | Telugu

బిగ్‌బాస్ : ఇంత‌కీ 13 వారాల‌కు పింకీకి ఎంత ద‌క్కింది?

బిగ్‌బాస్ 13వ వారం ఎలిమినేష‌న్ కార‌ణంగా హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చిన కంటెస్టెంట్ ప్రియాంక సింగ్‌.. పింకీ.. గ‌త కొన్ని వారాలుగా పింకీ ఎలిమ‌నేట్ అవుతుందంటూ ప్ర‌చారం మొద‌లైంది. త‌న‌పై ఎంత ప్ర‌చారం జ‌రిగినా వార వారానికి పింకీ స్ట్రాంగ్ అవుతూ వ‌చ్చింది. త‌ను కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌నే అని ప్రూవ్ చేసుకోవ‌డ‌మే కాకుండా టాస్కుల్లోనూ త‌న స‌త్తా చాటుతూ ఔరా అనిపించింది. పింకీ గేమ్ స్ట్రాట‌జీని గ‌మ‌నించిన వారంతా త‌ను టాప్ ఫైవ్‌లో ఖ‌చ్చితంగా వుంటుందిని భావించారు.

కానీ అనూహ్యంగా పింకీ ఈ 13వ వారం ఎలిమినేట్ అయి ఇంటి నుంచి బ‌య‌టికి వెళ్లింది. ఆదివారం జ‌రిగిన ఎలిమినేష‌న్ రౌండ్‌లో పింకీ ఎలిమ‌నేట్ అయింది. అయితే తన‌కు హౌస్ నుంచి బ‌య‌టికి వెళుతున్నాననే బాధ‌కంటే మాన‌స్‌ని వీడి వెళుతున్నాన‌నే బాధే ఎక్కువ‌గా వున్న‌ట్టుగా క‌నిపించింది. త‌న మాట‌ల‌తో.. చేత‌ల‌తో ప్ర‌తీ ఇంటి స‌భ్యుల‌ని ఆక‌ట్టుకున్న పింకీ ఈ షో ద్వారా 13 వారాల‌కు గానూ ఎంత సొంతం చేసుకుందన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

దీనిపై సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది. పింకీ ఎలిమినేట్ అయినా భారీ మొత్తాన్నే ద‌క్కించుకుంద‌ని కొంత మంది.... భారీ మొత్తంతో పాటు మంచి పాపులారిటీని కూడా ద‌క్కించుకుంద‌ని మ‌రి కొంత మంది చెబుతున్నారు. పింకీకి బిగ్‌బాస్ వ‌ర్గాలు వారానికి 1.75 నుంచి 2 ల‌క్ష‌ల వ‌ర‌కు పారితోషికాన్ని అందించార‌ని తెలుస్తోంది. అలా చూస్తే 13 వారాల‌కు గానూ దాదాపుగా ఇర‌వై ఆరు ల‌క్ష‌ల వ‌ర‌కు పింకీకి అందిన‌ట్టుగా స‌మాచారం.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.