English | Telugu
Guppedantha Manasu : నిజం ఒప్పుకున్న అనుపమ.. అంత తప్పు ఏం చేసింది!
Updated : Aug 21, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1158 లో.....రిషి, వసుధారలు అనుపమ దగ్గరికి బయలుదేరుతుంటే.. అప్పుడే మహేంద్ర వచ్చి నేను వస్తానని అంటాడు. ముందు రిషి సరే అంటాడు. ఆ తర్వాత వసుధార మావయ్య వద్దని అనగానే సరే డాడ్ మీరు వద్దని చెప్తాడు. వసుధార నా దగ్గర ఏదో విషయం దాస్తుంది.. అది కనిపెట్టాలని మహేంద్ర అనుకుంటాడు. మరొకవైపు మనుకి శైలేంద్ర ఫోన్ చేసి.. తమ్ముడు అంటూ మాట్లాడేసరికి మనుకి కోపం వస్తుంది. నిన్ను కలవాలి రాలేదంటే మీ అమ్మకి ఫోన్ చేసి నన్ను కిడ్నాప్ చేసి విషయం తెలుసుకున్నావని చెప్తానని శైలేంద్ర అనగానే కోపంగా మను బయలుదేర్తాడు.
మను కోపంగా వెళ్లడం అనుపమ చూస్తుంది. ఆ తర్వాత అనుపమ దగ్గరికి వసుధార, రిషిలు వస్తారు. మను ఎక్కడికి వెళ్ళాడో అడుగగా.. తెలియదని అనుపమ చెప్తుంది. కాఫీ తీసుకొని వస్తానని అనుపమ వెళ్ళగానే.. నేను వస్తానంటూ వసుధార కూడ కిచెన్ లోకి వెళ్తుంది. మేడమ్ నేనొక నిర్ణయం తీసుకున్నాను.. మీ సమక్షంలో రిషి సర్ కీ నిజం చెప్పాలని తీసుకొని వచ్చానని వసుధార అనగానే అనుపమ టెన్షన్ పడుతుంది. మరొకవైపు శైలేంద్రని కలిసిన మను తనపై కోప్పడుతాడు. ఇక ఇప్పుడు నువ్వు చెయ్యాలి అనుకుంటున్నావు అదే.. మా బాబాయ్ నీ కన్నతండ్రి అని తెలిసింది కదా అని శైలేంద్ర అంటాడు. అంటే ఆస్తిలో వాటా అడగాలి అనుకుంటున్నావా అని శైలేంద్ర అనగానే.. నేను అలా ఆస్తుల కోసం పదవి కోసం మనుషులని బాధపెట్టే రకం కాదని మను అంటాడు. నువ్వు ఇలా వాళ్లకు చెప్తాను.. వీళ్లకి చెప్తానంటూ బ్లాక్ మెయిల్ చేస్తే బాగుండదు.. ఎవరికి అయినా చెప్పుకో నాకు అవసరం లేదు. ఆగస్టు లోగా నేను చెయ్యాలిసింది నేను చేస్తానని శైలేంద్రకి మను వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు.
అ తర్వాత రిషి కిచెన్ దగ్గరికి వస్తాడు. ఇన్నిరోజలుగా మేడమ్ మను తండ్రి గురించి చెప్పట్లేదు కదా అని వసుధార అనగానే మీరు ఇంతలా చెప్పకుండా ఉంటున్నారంటే చెప్పేది అయి ఉండదేమో.. అతను మంచివాడు కాదేమోనని రిషి అనగానే.. సర్ మీరు అలా అనకండి మను తండ్రి మావయ్యనే అని వసుధార అంటుంది. దాంతో రిషి షాక్ అవుతాడు. అప్పుడే మహేంద్ర వచ్చి అ మాట విని షాక్ అవుతాడు. మీరు ఇదే దాచారా ఇంకేదైనా ఉందా అని రిషి అంటాడు. వసుధర చెప్పేది నిజమేనా అని అనుపమని రిషి అడుగుతాడు. నిజమే.. నేనే తప్పు చేసాను. నన్ను ఇంకేం అడగకండి అని అనుపమ వెళిపోతుంది. ఆ మాటలు వింటూ మహేంద్ర ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.