English | Telugu

Eto Vellipoyindhi Manasu : అత్తింటి వాళ్ళు ఇచ్చి‌న గిఫ్ట్ చూసి అల్లుడు ఫిధా.. భార్య గిఫ్ట్ ఏంటంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్నా సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -180 లో....సీతాకాంత్ కేక్ కటింగ్ దగ్గరికి వస్తాడు. చూసావా అన్నయ్య.. నీ ఇష్టానికి తగ్గట్టు ఎలా వదిన ఏర్పాట్లు చేసిందోనని సిరి అనగానే.. సీతాకాంత్ హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. ఎంతైనా భర్త మీద ప్రేమ అలాంటిది కదా అని పెద్దాయన అంటాడు. వచ్చినవాళ్ళు మీరిద్దరి కాంబినేషన్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అంటారు.

అ తర్వాత అన్నయ్య పక్కకి వెళ్ళు అమ్మ అని సందీప్ అంటాడు. ఎందుకు అవమానపడేందుకా.. అది పక్కనే ఉంది కదా అని శ్రీలత అంటుంది. రామలక్ష్మి నాపై పంతంతో ఏదైనా చేస్తుందని అంటుంది. అప్పుడే శ్రీలతని సీతాకాంత్.. అంత దూరంగా ఉన్నావేంటి అమ్మ.. వచ్చి నా పక్కన ఉండమని అంటాడు. పర్లేదు అని శ్రీలత అనగానే.. అత్తయ్య గారిని నేను పిలుచుకొని వస్తానని రామలక్ష్మి వస్తుంది. అత్తయ్య రండి మీరు తన పక్కన ఉండాలి.. సొంతతల్లి కాకున్నా సవతి తల్లి అయిన కూడా బాగా చూసుకున్నారని రామలక్ష్మి ఇండైరెక్ట్ గా తన కపట ప్రేమ గురించి మాట్లాడుతుంది. ఆ తర్వాత సీతాకాంత్ కేక్ కట్ చేసి శ్రీలతకి తినిపిస్తుంటే.. ఎప్పుడు అమ్మకేనా ఈ సారి నీ భార్యకి తినిపించమని పెద్దాయన అనగానే.. రామలక్ష్మికి సీతాకాంత్ తినిపిస్తుంటాడు. ఎవరికైనా తల్లి ఫస్ట్ తనకి తినిపించండని రామలక్ష్మి అనగానే.. సీతాకాంత్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత కేక్ తినిపించక.. అందరు గిఫ్ట్స్ ఇస్తుంటారు. శ్రీలత దగ్గర సీతాకాంత్ ఆశీర్వాదం తీసుకుంటాడు. సీతాకాంత్ కోసం సుజాత గిఫ్ట్ తీసుకొని వస్తుంది. కానీ అది అతని రేంజ్ కి తక్కువ అవుతుందని ఇవ్వకుండా ఉంటుంద. అప్పుడే రామలక్ష్మి రావడంతో బావ కోసం గిఫ్ట్ తెచ్చాము.. అమ్మ ఇవ్వట్లేదని పింకీ చెప్తుంది.

అ తర్వాత సీతాకాంత్ ని రామలక్ష్మి పిలిచి.. మా అమ్మ వాళ్ళు ఏదో గిఫ్ట్ తెచ్చారు మీ స్థాయికి సరిపోదని ఇవ్వట్లేదని అనగానే పర్లేదు అత్తయ్య ఇవ్వండని సీతాకాంత్ అనగానే.. సుజాత గోల్డ్ చైన్ ఇస్తుంది. అది చూసి అది గోల్డ్ ఏనా.. అది మా ఇంట్లో పనిమనిషి కూడ వెయ్యదంటూ సుజాతని శ్రీవల్లి అవమానిస్తుంటే.. సీతాకాంత్ తనపై కోప్పడుతాడు. గిఫ్ట్ నాకు బాగా నచ్చిందని సీతాకాంత్ అంటాడు. నీ పుట్టింటి వాళ్ళు తెచ్చిన గిఫ్ట్ నీ చేతులతో సీతాకాంత్ మెడలో వేయమని పెద్దాయన అనగానే.. రామలక్ష్మి వేస్తుంది. ఆ తర్వాత పెద్దాయన.. నీ మనసులో మాట రామలక్ష్మికి వెళ్ళి చెప్పమని అంటాడు. సీతాకాంత్ తన కోసం తీసుకొని వచ్చిన రింగ్ తీసుకొని రామలక్ష్మి దగ్గరికి వెళ్తాడు. అందరూ గిఫ్ట్ ఇస్తున్నారు. నువ్వు ఇంకా ఇవ్వలేదని సీతాకాంత్ అంటాడు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.