English | Telugu

నచ్చిన అబ్బాయి దొరికితే పెళ్లి చేసుకుంటా!


హిందీ సీరియల్ కి రీమేక్ ఐన సీరియల్ 'ఎన్నెన్నో జన్మల బంధం'. మాతృత్వానికి దూరమైన ఒక అమ్మాయి సొసైటీలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది అనే కాన్సెప్ట్ తో ఈ సీరియల్ వస్తోంది. తెలుగు ఆడియన్స్ కి బాగా నచ్చిన సీరియల్.. ఇందులో వేదగా నటిస్తున్న హీరోయిన్ అసలు పేరు డెబిజాన్ మొదక్. ఈమె తనకి సంబంధించిన ఎన్నో విషయాలను ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది. "నా ఫస్ట్ సీరియల్ కలర్ బంగ్లాలో వచ్చింది "అపాంజాన్" అని...ఇలా నాకు తెలుగులో ఆఫర్ వచ్చేసరికి కొంచెం భయం వేసింది.

ఎందుకంటే లాంగ్వేజ్ తెలీదు కదా. హైదరాబాద్ బిర్యాని అంటే ఇష్టం. హలీం ట్రై చేశా..బాగుంది...ఇకపోతే నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఒకవేళ ఎప్పుడైనా నచ్చిన అబ్బాయి దొరికితే పెళ్లి చేసుకుంటాను. మంచి యంగ్ గా కనిపించడానికి కారణం మన ఆలోచనా విధానం. ఎలా ఆలోచిస్తామో మన ఫేస్ కూడా అలాగే కనిపిస్తుంది. ఎలాంటి అబ్బాయి కావాలో ఎప్పుడూ ఆలోచించలేదు. ఇక్కడ ఎండలు అదిరిపోతున్నాయి. నాకు బెంగాలీ ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టం...ఫిష్ ఎక్కువగా తినడానికి ఇష్టపడతాను. హీరోస్ లో మహేష్ బాబు, వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ అంటే ఇష్టం. హీరోయిన్స్ లో అనుష్క, తమన్నా, రష్మిక అంటే ఇష్టం. ఇది తెలుగులో నా ఫస్ట్ సీరియల్.

లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా సెట్ లో నాకు అందరూ హెల్ప్ చేస్తారు. అలాగే కొన్ని వర్డ్స్ అర్ధం కాకపోయినా యష్ నాకు హిందీలో, తెలుగులో ఎక్ష్ప్లైన్ చేస్తారు. మా ఇంట్లో మా పేరెంట్స్ అంతా నా సీరియల్ చూస్తారు. మా అత్తా వాళ్లకు అర్ధం కానప్పుడు ట్రాన్స్లేట్ చేసి చెప్తూ ఉంటారు. అందానికి సీక్రెట్ ఏమీ లేదు..ఎక్కువగా వాటర్ తాగుతాను. ఏ ప్లేస్ కి వెళ్తే ఆ ప్లేస్ ఉన్న ఫుడ్ ని ఎక్కువగా తింటాను. నాకు మూవీస్ లో ఆఫర్స్ వస్తున్నాయి. కానీ డేట్స్ ప్రాబ్లమ్స్ వలన చేయలేకపోతున్నా.. ప్రస్తుతానికి ఈ ఒక్క సీరియల్ మాత్రమే చేస్తున్నా" అని చెప్పింది వేద.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.