English | Telugu

రాజ్ బెడ్ మీద పడుకున్న కావ్య.. ఆనందంలో అప్పుని ఎత్తుకున్న కళ్యాణ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -117 లో.. కావ్య వాళ్ళ కుటుంబాన్ని రుద్రాణి అవమానిస్తుంది. దాంతో రాహుల్ గురించి అతను అమ్మాయిలను చీటింగ్ చేసినదంతా చెప్తూ రుద్రాణితో కావ్య ఉంటుంది. అది విని తట్టుకోలేని రుద్రాణి.. ఈ అలాగ జనాలతో సంబంధం కలుపుకోవాలా, ఇక్కడ నుండి వెళ్లిపోండి అందరికి పై చీటింగ్ కేసు పెడతానని రుద్రాణి అంటుంది.

ఆ తర్వాత రుద్రాణి అలా అనగానే రాజ్ కోపంతో ఎవరిపై కేసు పెడుతారు అత్త... ముసుగు వేసి ఈ అమ్మాయిని పెళ్లిపీటలపై కూర్చొపెట్టి పెళ్లి చేసి చీటింగ్ చేసింది నువ్వు.. పెళ్లిపీటల మీద నుండి పెళ్లి కూతురిని లేపుకెళ్ళింది వీడు. వీడిపై పెట్టాలి చీటింగ్ కేసు అని రాజ్ అంటాడు. రుద్రాణి మౌనంగా ఉంటుంది. చేసిందే తప్పు ఇంకా పైగా ఇలా మాట్లాడుతున్నారా అని రాజ్ అంటాడు. ఇక అందరు రాహుల్ చేసిన తప్పుని ఎత్తి చూపిస్తుంటే రుద్రాణి తట్టుకోలేదు.

ఎవరు ఎమన్నా రాహుల్, స్వప్నల పెళ్లి జరిగి తీరుతుందని రాజ్ అంటాడు. పంతులు గారు ముహూర్తం చుడండి అని రాజ్ అనగానే పంతులు ముహూర్తం చూసి ఎల్లుండే మంచి ముహూర్తం ఉందని చెప్తాడు. పెళ్లి అంత దగ్గరయితే మాకు ఇబ్బంది అవుతుందని కనకం అనగానే.. "మీరేం టెన్షన్ పడకండి. రాజ్ పెళ్లి ఎంత గ్రాండ్ గా చేసామో రాహుల్ పెళ్లి కూడా అలాగే చేస్తాం. మీరు రేపే రండి" అని ఇందిరాదేవి అంటుంది. పెళ్లి ఫిక్స్ చేసిన విషయం కళ్యాణ్ కి ధాన్యలక్ష్మి ఫోన్ చేసి చెప్తుంది. కళ్యాణ్ హ్యాపీ నెస్ తో తన పక్కనే ఉన్న అప్పుని ఎత్తుకుంటాడు. ఏంటి ఇలా చేస్తున్నావని అప్పు అంటుంది.

మరొకవైపు ఇంటికి వెళ్లిన కనకం ఫ్యామిలీ.. పెళ్లి ఎలా చెయ్యాలా అని ఆలోచిస్తారు. అప్పుడే కృష్ణమూర్తి ఇంటిని తాకట్టు పెడుదామని అంటాడు. అది విని కనకం షాక్ అవుతుంది. ఎందుకంటే స్వప్న పెళ్లికి కనకం ఇల్లు తాకట్టు పెడుతుంది.. అది కృష్ణమూర్తికి తెలియకుండా కనకం జాగ్రత్తపడుతుంది. మరొకవైపు కావ్య.. నేను నిర్దోషిని. నా హక్కులు బాధ్యతలు కాపాడుకుంటానని రాజ్ పక్కన బెడ్ పై పడుకుంటుంది. రాజ్ కోపంగా నేలపై పడుకుంటాడు. ఆ తర్వాత రాజ్ కింద పడుకొని ఇబ్బంది పడడం చూసిన కావ్య పైన పడుకోండని చెప్తుంది. నువ్వు చెప్తే నేనేందుకు వినాలని చెప్పి రాజ్ నేలపై పడుకుంటాడు.. కావ్య కూడా మరొకవైపు నేలపై పడుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...