English | Telugu

 `గుప్పెడంత మ‌న‌సు` : బ‌య‌ట‌ప‌డిన దేవ‌యాని కుట్ర‌

మ‌హిళా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్న ధారావాహిక `గుప్పెడంత మ‌న‌సు`. వ‌సుధార , రిషిల చిలిపి ప్రేమ‌క‌థ నేప‌థ్యంలో సాగుతున్న ఈ సీరియ‌ల్ గ‌త కొన్ని వారాలుగా బుల్లితెర ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తోంది. తాజాగా మంగ‌ళ‌వారం 299వ ఎపిసోడ్‌లోకి అడుగుపెడుతోంది. ఈ రోజు హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వ‌సు కోసం జ‌గ‌తి ఇంటికి వ‌చ్చిన రిషి అక్క‌డే వ‌సు వంట చేయ‌డంతో భోజ‌నం కూడా లాగించేస్తాడు. ఆ త‌రువాత వ‌సుకి థ్యాంక్స్ చెప్పేస్తాడు.

ఇది చ‌లా గొప్ప విష‌యం సార్‌. జ‌గ‌తి మేడ‌మ్ ఇంటికి రావ‌డం.. ఇక్క‌డే భోజ‌నం చేయ‌డం నిజంగా గొప్ప విష‌యం సార్ అంటుంది. ఆ మాట‌లు విన్న వెంట‌నే రిషికి ఇగో త‌న్నుకొస్తుంది. వెంట‌నే `నిజ‌మే క‌దా.. నేనేంటి ఇక్క‌డ తిన్నాను` అన‌కుంటూ వ‌సు పిలుస్తున్నా ఆగ‌కుండా అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు రిషి. క‌ట్ చేస్తే జ‌గ‌తి, మ‌హేంద్ర ఇంటికి వ‌చ్చేస్తారు. మ‌హేంద్ర‌కు కాల్ రాగానే బ‌య‌టికి వెళ్లిపోతారు. అక్క‌డ డైనింగ్ టేబుల్‌పై రెండు ప్లేట్లు వుండ‌టాన్ని గ‌మ‌నించిన జ‌గ‌తి `ఏంటి వ‌సు రెండు సార్లు తినేసి ప్లేట్‌లు క‌డ‌గ‌డం మానేసావా? అంటుంది. రిషి వ‌చ్చిన విష‌యం చెప్పేస్తుంది వ‌సు.

విష‌యం తెలియ‌గానే జ‌గ‌తి న‌వ్వే ఓ గెస్ట్‌వి అంటూ షాకిస్తుంది. ఇదిలా వుంటే రిషి, వ‌సుధార‌ల మ‌ధ్య ఏదో జ‌రుగుతోంద‌ని దేవ‌యాని ఆరాతీయ‌డం మొద‌లుపెడుతుంది. ఆ విష‌యం మ‌హేంద్ర‌కు తెలుస్తుంది. దేవ‌యాని కుట్ర గురించి తెలుసుకున్న మ‌హేంద్ర `వ‌దిగారు ఏం చేస్తున్నా ఓపిక ప‌డుతున్నాను.. ఆమె భ‌య‌ప‌డే రోజు ఖ‌చ్చితంగా వ‌స్తుంద‌ని మ‌హేంద్ర అంటాడు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? క‌థ ఎలాంటి మ‌లుపులు తిరిగింది? .. కాలేజీకి వెళుతూ వ‌సుధార‌తో రిషి చేసిన చిలిపి ప‌ని ఏంటీ అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.