English | Telugu

`ఎన్నెన్నో జ‌న్మ‌ల‌బంధం`: త‌ప్పులో కాలేసిన య‌శోధ‌ర్‌

`స్టార్ మా`లో రీసెంట్‌గా మొద‌లైన ప్రేమ‌క‌థ `ఎన్నెన్నో జ‌న్మ‌ల‌బంధం`. ప్రారంభం నుంచి మేకింగ్ ప‌రంగా, కంటెంట్ ప‌రంగా ఈ సీరియ‌ల్ ఆక‌ట్టుకుంటోంది. తెలుగు సీరియ‌ల్స్ అంటే క‌న్న‌డ స్టార్స్ అనేట్టుగా మారిన ఈ నేప‌థ్యంలో ఈ సీరియ‌ల్‌లోనూ క‌న్న‌డ టీవీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారే ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. బెంగ‌ళూరుకు చెందిన నిరంజ‌న్ కోల్‌క‌తాకు చెందిన డెబ్‌జాని మోడ‌క్ కీల‌క పాత్ర‌ల్లో య‌శోధ‌ర్‌, వేద‌లుగా న‌టించారు. మ‌రో కీల‌క పాత్ర‌లో బెంగ‌ళూరు ప‌ద్మ న‌టించింది.

శిన‌వారం ఖుషీని వేద కిడ్నాప్ చేసిందంటూ య‌శోధ‌ర్ త‌ల్లి అనుమానించ‌డంతో ఆమెపై కేసు పెడ‌తాడు య‌శోధ‌ర్‌. దీంతో వేద తండ్రిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేష‌న్‌కి తీసుకెళ‌తారు. అక్క‌డికి వెళ్లిన వేద ముందు ఖుషీని ఒంట‌రిని చేసిన య‌శోధ‌ర్‌ని నిల‌దీస్తుంది. గంట ఆల‌స్య‌మైతే ఖుషీ ప్రాణాల‌కే ప్ర‌మాదం జ‌రిగేద‌ని చ‌,ఎబుతుంది. కావాలంటే డాక్ట‌ర్‌ని అడిగి తెలుసుకోండి అంటుంది. అయితే నువ్వు చెప్పిందే నిజ‌మ‌ని గ్యారంటీ ఏంట‌ని ఇన్స్‌పెక్ట‌ర్ ప్ర‌శ్నిస్తాడు. సాక్ష‌మేంట‌ని నిల‌దీస్తాడు.

ఇలా వేద‌ని య‌శోధ‌ర్‌, ఇన్స్‌పెక్ట‌ర్ ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న స‌మ‌యంలో నేను సాక్షం అంటూ య‌శోధ‌ర్ మాజీ భార్య అక్క‌డికి వ‌చ్చి షాకిస్తుంది. డాక్ట‌ర్ వేద ఖుషీని కిడ్నాప్ చేసింద‌న‌డానికి మీద‌గ్గ‌ర ఏదైనా ఆధారం వుందా? అంటుంది. దానికి వెంట‌నే `చెయ్య‌లేదు అన‌డానికి మీద‌గ్గ‌ర ఏం సాక్ష్యం వుంద‌ని ఇన్స్ పెక్ట‌ర్ ప్ర‌శ్నిస్తాడు. వెంట‌నే యశోధ‌ర్ మాజీ భార్య వేద ఖుషీని కిడ్నాప్ చెయ్య‌లేదు అన‌డానికి సాక్ష్యం నేనే అంటుంది. వెంట‌నే వాట్ మీరెవ‌రు అస‌లు అని ఇన్స్‌పెక్ట‌ర్ ప్ర‌శ్నించ‌డంతో `ఖుషీ క‌న్న‌త‌ల్లిని` అని అంటుంది. దీంతో య‌శోధ‌ర్‌, ఇన్స్‌పెక్ట‌ర్ ఇద్ద‌రూ షాక్‌కి గుర‌వుతారు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. వేద విష‌యంలో త‌ప్పు చేశాన‌ని య‌శోధ‌ర్ తెలుసుకున్నాడా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు 9:30 గంట‌ల‌కు ప్ర‌సారం అయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.