English | Telugu
Brahmamudi : సీఈఓ చేతుల మీదుగా దీపావళి బోనస్.. కావ్య, రాజ్ ల మధ్య రచ్చ!
Updated : Nov 7, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -561 లో.....ఇందిరాదేవి ఎంప్లాయిస్ కి ఇచ్చే బోనస్ చెక్కు లని చూడమని కావ్యకి ఇస్తుంది. ఒకసారి ఆలోచించండి నా కంటే మీ మనవడి చేతుల మీదుగా ఇస్తే బాగుంటుందని కావ్య అనగానే.. అలా ఏం వద్దు నువ్వు సీఈఓ కాబట్టి నువ్వే ఇవ్వాలని ఇందిరాదేవి అంటుంది. మీరు ఇలా వినేలా లేరు.. నేనే ఆయన దగ్గరికి వెళ్లి మాట్లాడతానని రాజ్ దగ్గరికి వెళ్తుంది కావ్య.
కావ్యని చూసి రాజ్ చిర్రు బుర్రులాడుతాడు. ఈ చెక్కు లు మీ చేతులు మీదుగా ఇవ్వండి అని కావ్య అనగానే.. ఏంటి జాలి చూపిస్తున్నావా.. నాకు అవసరం లేదు.. నేను ఇవ్వను నువ్వు టెంపరరీ సీఈఓవి నేనే ఆ కంపెనీ కి అసలైన సీఈఓని అని రాజ్ అంటాడు. మరోవైపు ఏంటి ధాన్యలక్ష్మి డల్ గా ఉన్నావంటూ రుద్రాణి వస్తుంది. నీ కొడుకు, కోడలు రాలేదని అలా ఉన్నావా అదిగో వస్తున్నారంటూ అప్పుడే వస్తున్న అప్పు, కళ్యాణ్ లని చూపిస్తుంది. ఆ తర్వాత ప్రకాష్ స్వప్నలు వస్తారు. నా కొడుకుకి టిఫిన్ పెట్టు స్వప్న అనగానే.. అంటే నా చెల్లికి వద్దా అని స్వప్న అంటుంది. నువ్వు చూసుకుంటావ్ కదా నీ చెల్లిని అని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ తర్వాత కళ్యాణ్ దగ్గరికి అప్పు వచ్చి.. నువ్వు మీ పేరెంట్స్ కి తీసుకున్న బట్టలు ఇవ్వమని అంటుంది. ఇద్దరు వెళ్లి ధాన్యలక్ష్మి, ప్రకాష్ లకి నా మొదట శాలరీ తో తీసుకున్నానని కళ్యాణ్ అంటాడు కానీ ధాన్యలక్ష్మి కళ్యాణ్ కి ఒక్కడికే తీసుకుంటుంది. నేను అప్పుకి తీసుకున్నా అని ప్రకాష్ అప్పుకి చీర తీసుకొని వచ్చి ఇస్తాడు.
ఆ తర్వాత అందరు హ్యాపీగా ఉంటే చూడలేని రుద్రాణి.. అనామిక కి ఫోన్ చేసి ఏమైంది నీ ప్లాన్ అని అడుగుతుంది. న్యూస్ ఛానెల్ వాళ్ళు టైమ్ చెప్పగానే చెప్తానని అనామిక అంటుంది. ఆ తర్వాత పూజ జరుగుతుంది. తరువాయి భాగంలో నువ్వు ఎంప్లాయివేగా.. నీకు నేను బోనస్ ఇస్తున్నానని కావ్యకి రాజ్ చెక్ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.