English | Telugu

సవతి తల్లి కపట ప్రేమని గుర్తించని కొడుకు.. భార్యని అనుమానిస్తాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -247 లో... సీతాకాంత్ దగ్గరికి శ్రీలత వచ్చి.. తన కపట ప్రేమని నటిస్తుంది. నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను.. నేను ఉండడం నీ భార్యకి ఇష్టం లేదు.. మీరు హ్యాపీగా ఉండండి అని శ్రీలత అంటుంది. ఈ ఆస్తులు సంపాదించింది ఎవరికోసం మన కుటుంబం కోసం కదా.. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంతగా వెళ్తే తప్పు చేసిన వాళ్ళు వెళ్తారని సీతాకాంత్ అంటాడు.

నువు ఎక్కడికి వెళ్లకంటూ శ్రీలత దగ్గర మాట తీసుకుంటాడు సీతాకాంత్. ఆ తర్వాత రామలక్ష్మి జరిగింది గుర్తుచేసుకుంటూ ఉంటుంది. ఇది కచ్చితంగా అత్తమ్మ పనే అనుకుంటుంది. అప్పుడే శ్రీలత వస్తుంది. ఏంటి అంత కోపంగా చూస్తున్నావని శ్రీలత అడుగుతుంది. తనకి కోపం వచ్చేలా మాట్లాడేసరికి శ్రీలతపై రామలక్ష్మి చెయ్ ఎత్తుతుంది. ఏంటి భయపడుతున్నవా.. ఇంకొకసారి రామలక్ష్మి జోలికి వెళ్ళకూడదనేలా చేస్తాను చూడమని శ్రీలతకి సవాలు విసురుతుంది రామలక్ష్మి.ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మి వస్తుంది. మాట్లాడే ప్రయత్నం చేస్తే కోప్పడతాడు. నా తల్లి పై చెయ్ ఎత్తావంటూ కోప్పడతాడు. తను మీకు నా గురించి చెడుగా చెప్పి అనుమానం వచ్చేలా చేస్తుంది.. అసలు మీకు ఏమైనా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తాడేమో అని వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళాను.. మీకు చెప్పకపోవడం నా తప్పేనని రామలక్ష్మి అంటుంది.

నాకు నీపై అనుమానం లేదు కానీ నువ్వు నా తల్లిపై చెయ్ ఎత్తావు అంటూ సీతాకాంత్ కోప్పడి వెళ్ళిపోతాడు. నాపై ఎలాంటి అనుమానం లేదని చెప్పాడని హ్యాపీగా ఫీల్ అవుతుంది రామలక్ష్మి.ఆ తర్వాత మరుసటి రోజు సీతాకాంత్ కి రామలక్ష్మి అన్ని తీస్తుంటే.. తను ఇచ్చిందేం తీసుకోడు. మరొక వైపు డిటెక్టివ్ తప్పించుకుంటాడు. అభి ఆ విషయం నందినికి ఫోన్ చేసి చెప్పగా కోప్పడుతుంది. వాడి సంగతి నేనే చూసుకుంటానని నందిని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.