English | Telugu

తేజ క్రష్ ప్రేరణ అంట.. సీక్రెట్ రూమ్ డ్రామా!!


బిగ్ బాస్ సీజన్-8 లో పదో వారం టాస్క్ లతో పాటు సీక్రెట్ రూమ్ డ్రామాలు కొనసాగాయి. ఒక నామినేషన్ , టాస్క్ మాత్రమే కాదు ఎంటర్‌టైన్మెంట్ కూడా ఉంది అన్నట్టుగా నిన్నటి ఎపిసోడ్ సాగింది. బిగ్ బాస్ టేస్టీ తేజ ని కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు. అతని ముందు మూడు కప్ కేక్ లు పెట్టి.. అది తినాలి అంటే ప్రైజ్ మనీ నుండి మనీ కట్ అవుతుందని బిగ్ బాస్ చెప్తాడు. దాంతో వద్దండి నేను డైటింగ్ లో ఉన్నాను.. నేను సన్నగా అయితే నాగార్జున సర్ తన షర్ట్స్ ఇస్తానన్నాడని తేజ అంటాడు.

అయితే ఆ కేక్ తినాలంటే హౌస్ లో జరిగే ఒక గాసిప్ చెప్పమని తేజతో బిగ్ బాస్ అనగా.. మొన్నటి వరకు ఏ వచ్చి బి పై వాలే బి వచ్చి సి పై వాలే అంటూ జరిగింది కదా ఇక ఏ అంటే గౌతమ్ బి అంటే యశ్మీ సి అంటే నిఖిల్ లు.. బి, సి ల లైన్ క్లియర్ ఉందని 'ఏ' సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు బి, సి లు కూడ మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు.. ఏ మాత్రం 'బి' ని అక్కని చేసుకున్నాడు. ఇంతకు మించి ఏం లేదని తేజ చెప్తాడు. దాంతో కేక్ తినమని బిగ్ బాస్ చెప్తాడు. డైటింగ్ లేదు ఏం లేదు కేక్ ని తేజ లాగించేస్తాడు.

తేజ మనలో మన మాట హౌస్ లో నీ క్రష్ ఎవరని బిగ్ బాస్ అడగగా.. కాస్త సిగ్గు పడుతూ 'ప్రేరణ' అని తేజ చెప్తాడు.అమ్మాయి బాగుంటది.. నాతో బాగా మాట్లాడుద్ది.. అన్నీ షేర్ చేసుకుంటామని చెప్పి బయటకు వచ్చి.. ఓవర్ యాక్టింగ్ చేస్తుంటాడు తేజ. యష్మీ.. నీ సూట్ కేసు ఎవరైనా ఇవ్వాలంటే ఎవరికి ఇస్తావంటూ బిగ్ బాస్ అడుగుతాడు. యష్మీ ఆలోచించకుండా గౌతమ్ కి అనేస్తుంది. బిగ్ బాస్ అనౌన్స్ మెంట్ వస్తేనే ఇవ్వమంటూ పృథ్వీ, నిఖిల్ లు అంటున్నా కూడా గౌతమ్ కి అనేస్తుంది యష్మీ.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.