English | Telugu
బ్రహ్మముడి కావ్య సైంటిస్ట్ అన్న విషయం తెలుసా?
Updated : Aug 20, 2024
స్టార్ మాలో బ్రహ్మముడి సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది. ఇక ఇందులో కావ్య, రాజ్ లవ్ ట్రాక్ చాల బాగుంది. ఇక బయట కూడా ఈ హిట్ జోడి అప్పుడప్పుడు షోస్, ఈవెంట్స్ లో కనిపిస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అలాగే కావ్య అలియాస్ దీపికా రంగరాజు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ లు పెడుతూ ఉంటుంది. వీడియోస్, రీల్స్ చేస్తూ ఉంటుంది. బ్రహ్మముడి సీరియల్ వాళ్లందరితో కలిసి ఈ వీడియోస్ చేస్తుంది. అలాంటి కావ్య రీసెంట్ గా ఒక వీడియోని పోస్ట్ చేసింది.
ఆ వీడియో భలే ఫన్నీగా ఉంది. సీరియల్ లో ధన్య లక్ష్మి - కావ్య కూర్చుని ఉంటారు. కావ్య అడిగే ప్రశ్నలకు ధాన్యలక్ష్మి జవాబులు ఇస్తూ ఉంటుంది. "అక్క ఆర్ట్ వేసేవాళ్లను ఏమంటారు అంటే ఆర్టిస్ట్ అని చెప్పింది. హెయిర్ స్టైల్ చేసేవాళ్లను ఏమంటారు ..హెయిర్ స్టైలిస్ట్, శారీ డ్రేప్ చేసేవాళ్లను..శారీ డ్రెపిస్టు..అని ఇలా కాన్వర్జేషన్ జరిగింది. ఐతే నేను సూపర్ గా సైన్ చేస్తాను. ఐతే నేను సైంటిస్టు" అని చెప్పుకుంది కావ్య. దానికి ధాన్యలక్ష్మికి నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు. ఇంతలో సీరియల్ లో ఇంద్రాణి వచ్చి ఇద్దరి చెవులు మెలేసి సరదాగా ఆటపట్టించి "నువ్వు సైంటిస్టా, నువ్వు శారీ డ్రెపిస్టా..వావ్ సిల్లీ" అనేసి వెళ్ళిపోయింది. ఇక నెటిజన్స్ ఐతే మేము కూడా సైంటిస్టులమే అంటూ ఫన్నీగా ఆటపట్టిస్తు కామెంట్స్ చేస్తున్నారు. కార్తీక దీపం సీరియల్ ఇపోయాకా ఆ ప్లేస్ లో ఈ బ్రహ్మముడి సీరియల్ ఎంట్రీ ఇచ్చింది. ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టే మంచి రేటింగ్ సంపాదించుకుంటోంది.