English | Telugu

అక్సా ఖాన్ ఎంత ప‌నిచేసింది.. 'ఢీ' ప‌రిస్థితేంటి?

'ఢీ' షో రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్లకు అక్సా ఖాన్ గురించి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నడుము తిప్పిందంటే చాలు.. ఎవ్వరికైనా మతి పోవాల్సిందే. అందాల అక్సా ఖాన్ కి చాలా మంది కూడా ఫాన్స్ ఉన్నారు. అప్పుడప్పుడు కామెడీటీ షోస్ లో కూడా మెరుస్తుంది అక్సా ఖాన్. జబర్దస్త్ షోలో హైపర్ ఆది స్కిట్ లో అప్పుడప్పుడు కనిపించేది కూడా. అలా బుల్లితెర పై చాలా తొందరగానే ఒక క్రేజ్ సంపాదించుకుంది. ఇక తనకు సంబందించిన విషయాలు, మంచి డాన్స్ పెర్ఫార్మెన్స్ వీడియోస్ అప్ డేట్స్ అన్నిటినీ సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

అక్సా ఖాన్ ముంబైలో 1996 లో పుట్టింది. ముంబైలోని క్వీన్ మేరీ స్కూల్ లో చదువుకుంది. హెచ్ఆర్ కాలేజీ అఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ కాలేజీ లో హయ్యర్ స్టడీస్ కంప్లీట్ చేసింది. ఐతే ఆమెకు బాగా ఇష్టమైన డాన్సర్ ప్రభుదేవా. ఆయన్ని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ మీదకు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది అక్సా.ఇప్ప‌టికే 'ద‌ర్జా' అనే సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. అది త్వ‌ర‌లో రిలీజ్ కాబోతోంది. అలాగే'సన్ ఆఫ్ ఇండియా' డైరెక్టర్ డైమండ్ రత్నబాబుతో ఓ సినిమా చేస్తోంది.

ఈ చిత్రంలో బిగ్ బాస్ విన్నర్ సన్నీ హీరోగా, అక్సా హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ సినిమాకి 'అన్‌స్టాప‌బుల్' అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రం షూటింగ్ ప్రక్రియ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. ఇక అక్సా ఖాన్, వీజే సన్నీ పెయిర్ కలిసి ఇంతకుముందు జీ తెలుగులో వచ్చిన డాన్స్ జోడి డాన్స్ షోలో పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు మూవీలో కలిసి న‌టిస్తున్నారు. ఈ మధ్యన వచ్చిన కామెడీ మూవీస్ కంటే కూడా ఈ మూవీలో అద్దిరిపోయే రేంజ్ లో కామెడీ ఉంటుందని చెప్తోంది అక్సా. మరి ఇంకా ఈ మూవీ అప్ డేట్స్ కోసం కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే. మొత్తానికి అక్సా సినిమాల్లోకి వెళ్లిపోవ‌డంతో 'ఢీ'లో ఆమె లేని లోటు కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.