English | Telugu

సుధీర్‌ని త‌ప్పించారా? త‌నే త‌ప్పుకున్నాడా?

జబర్దస్త్ కి క్రేజ్ ని, ఇమేజ్ ని తీసుకొచ్చాడు సుడిగాలి సుధీర్. మల్లెమాలకు దొరికిన పెద్ద అసెట్ గా సుధీర్ టీమ్ ని చెప్పుకుంటారు. ఎవరి అండదండ లేకుండా కష్టపడుతూ ఎదిగిన సుధీర్ తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ లో స్కిట్స్ చేసేవాడు. ఇక తన మార్క్ టైమింగ్ కామెడీతో ఎవరు ఎలాంటి పంచ్ జోక్స్ వేసిన ఓవర్ రియాక్ట్ కాకుండా సంయమనం పాటిస్తూ అన్ని విషయాలను లైట్ తీసుకుంటూ జనాల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు.

ఇప్పుడు స్మాల్ స్క్రీన్ కి టాప్ యాంకర్, బెస్ట్ యాక్టర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. నెమ్మదిగా సినిమాల్లోనూ అవకాశాలు తెచ్చుకుని అటు వైపు కూడా వెళ్లి నటించి వచ్చాడు. ఐతే ఇటీవల 'శ్రీదేవి డ్రామా కంపెనీ'కి హోస్ట్ గా చేస్తూ టాలెంట్ ఉన్న ప్రతీ ఒక్కరిని ఈ స్టేజి ద్వారా పరిచయం చేసి వాళ్ళ హృదయాల్లోనూ స్థానం సంపాదించాడు. ఇక ఈ మధ్యలో రష్మీతో జోడీగా సుధీర్ చేసిన స్కిట్స్ టాప్ రేటింగ్స్ లో దూసుకుపోయేవి. వీళ్ళ పెయిర్ ఎవర్ గ్రీన్ అంటూ పొగిడిన వాళ్ళే చాలామంది ఉన్నారు. వీళ్ళ మధ్య లవ్ ట్రాక్ ని ఎన్నో షోస్ క్యాష్ చేసుకున్నాయి కూడా.

ఐతే 'శ్రీదేవి డ్రామా కంపెనీ' స్టార్ట్ అయ్యాక 'జబర్దస్త్' నుంచి తప్పుకున్నాడు సుధీర్. ఆ తర్వాత కొద్ది రోజులకు 'ఎక్స్ట్రా జబర్దస్త్' నుంచి కూడా బయటికి వచ్చేసాడు. 'ఢీ' కొత్త సీజన్ నుంచి కూడా అతడిని పక్కకు తప్పించారు. అనిల్ రావిపూడి విచ్చేసిన ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో సుధీర్, గెటప్ శీను కనిపించకుండా పోయేసరికి ప్రేక్షకుల్లో చాలా అనుమానాలు వచ్చాయి. ఐతే ఈ వారం ప్రసారమైన 'శ్రీదేవి డ్రామా కంపెనీ' లేటెస్ట్ ఎపిసోడ్ లో కూడా సుధీర్ కనిపించలేదు. సుధీర్ ప్లేస్ ని రీప్లేస్ చేస్తూ రష్మీ హోస్ట్ చేసింది. అలాగే జడ్జిగా ఇంద్రజ కూడా కనిపించలేదు. ఆమె ప్లేస్ లో పూర్ణ వచ్చి కూర్చుంది.

ఐతే ఇప్పుడు సుడిగాలి సుధీర్ అనసూయతో కలిసి సూపర్ సింగర్ జూనియర్ షో కి హోస్ట్ గా చేస్తున్నాడు. దీని కోసమే ఆ షోస్ నుంచి వచ్చేసాడా..? రష్మీ ప్లాన్ ప్రకారమే అవకాశాలు తగ్గుతున్నాయని ఇలా చేసిందా..? జనాల్లో జబర్దస్త్ షో పేరు కన్నా సుధీర్ పేరే పాపులర్ అవుతోందని మల్లెమాల వాళ్ళే సుధీర్ ని తప్పించారా.. పొమ్మన లేక పొగబెట్టారా? వీటికి సమాధానం సుధీర్ చెప్పాల్సి ఉంది. ఐతే మరో వైపు సుధీర్ ఫాన్స్ మాత్రం ఆయన షోస్ నుంచి వెళ్లిపోతుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

ఐనా సరే ఆయన అభిమానులు ఆయనకు సపోర్ట్ గా నిలబడ్డారు. కొంత మంది మాత్రం టాలెంట్ వున్న వాళ్లకు ఆఫర్స్ మస్త్ వస్తూనే ఉంటాయి అంటుంటే ఇంకొంతమంది నెటిజన్స్ మాత్రం స్మాల్ స్క్రీన్ ఐనా బిగ్ స్క్రీన్ ఐనా ఎవరి ప్లేస్ ఎక్కడా శాశ్వతం కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి సుధీర్ ఈ సూపర్ సింగర్ జూనియర్ షోలో ఐనా ఎక్కువ కాలం కొనసాగుతాడా..? లేదా అనేది వేచి చూడాలి.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.