English | Telugu
సుమ.. వచ్చి కాళ్ళు పట్టు!
Updated : Jun 6, 2022
'దొరికినంత దోచుకో'అనే టాగ్ లైన్ తో ప్రసారమవుతున్న'క్యాష్' ప్రోగ్రాం ఏ వారానికి ఆ వారం మంచి ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ యాంకర్ సుమక్క కాబట్టి. అందరితో నవ్వుతూ నవ్విస్తూ ఈ ప్రోగ్రాంని వేరే లెవెల్ కి తీసుకెళ్తోంది. ఐతే ఇంత సందడిగా సాగే ఈ సీరియల్ లో సుమ ఒక విషయంలో చాలా హర్ట్ అయ్యింది. ఈ ప్రోగ్రాంకి జబర్దస్త్ కమెడియన్స్ వాళ్ళ ఫామిలీస్ వచ్చాయి. భార్యలు భర్తల కాళ్ళు పట్టి అందరికంటే సూపర్ వుమన్ అనిపించుకోవాలనే కాన్సెప్ట్ తో చాలా కామెడీగా సాగుతున్న ఈ ప్రోగ్రాంలో సుమకు కోపం వచ్చింది.
ఎందుకు అంటే జబర్దస్త్ కమెడియన్ శాంతికుమార్ ఒక్కసారిగా "సుమ.. వచ్చి కాళ్ళు పట్టు" అంటాడు. అంతే సుమ ఒక్కసారిగా అతని మీద ఫైర్ అయ్యింది. "ఈ సెట్ లో నన్నింత ధైర్యంగా ఎవ్వడు పిలవలేదు" అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. "అయ్యో మిమ్మల్ని కాదండి" అంటూ శాంతికుమార్ సారీ చెప్తాడు. అసలు ట్విస్ట్ ఏమిటంటే జబర్దస్త్ కమెడియన్ శాంతికుమార్ భార్య పేరు కూడా సుమనే.
స్కిట్ లో భాగంగా సుమ అని పిలిచేసరికి సుమక్క ఇన్వాల్వ్ అయ్యి కాస్త ఫన్ క్రియేట్ చేసింది. ఈ స్కిట్ వచ్చే వారం అంటే జూన్ 11న ప్రసారం కాబోయే కాష్ ప్రోగ్రాంలో రానుంది. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పటికే విడుదల అయ్యింది. ఈ వారం క్యాష్ లో ఆనంద్ - మంజుల, కొమరం - రజిత, శాంతికుమార్ - సుమ, నాగమాంబ - సత్తిపండు జంటలు పార్టిసిపేట్ చేయబోతున్నాయి. వీళ్లంతా జబర్దస్త్ కమెడియన్స్. ఈ వారం క్యాష్ షోలో ఫన్ అండ్ మస్తీ చేయడానికి వీళ్లంతా రాబోతున్నారు.