English | Telugu

దేవికి ఆదిత్య ఇచ్చిన స‌ర్‌ప్రైజ్ ఏంటీ?  

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా అల‌రిస్తున్న సీరియ‌ల్ `దేవ‌త‌`. అర్జున్ అంబ‌టి, సుహాసిని ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా అల‌రిస్తున్నఈ సీరియ‌ల్ `స్టార్ మా`లో ప్ర‌సారం అవుతోంది. ప్ర‌తి రోజు రాత్రి 8 గంట‌ల‌కు ప్ర‌సారం అవుతోంది. ఈ మంగ‌ళ‌వారం 449వ ఎపిసోడ్ ప్ర‌సారం కాబోతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఆదిత్య గురించి రుక్మిణికి ఏం తెలియ‌బోతోంది? .. స‌త్య.. రుక్మిణికి చెప్పిన నిజం ఏంటీ అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చూద్దాం.

సూది ఏతికి గుచ్చుకోవ‌డంతో రాధ వేలికి ర‌క్తం కారుతూ వుంటుంది. అది చూసిన దేవి క‌ళ్ల‌నిండా నీళ్లు తెచ్చుకుని వెంట‌నే రాధ వేలిని త‌న నోట్లో పెట్టుకుని `చూసుకోబ‌డ‌లేదా అమ్మా..` అంటూ ప్రేమ‌ని కురిపిస్తుంది. ఆ స‌న్నివేశాన్ని చిన్మ‌య్ తో పాటు మాధ‌వ కూడా చూసి మురిసిపోతారు. దేవి ప్రేమ‌ని చూసిన రాధ‌కు ఏడుపొస్తుంది. ద‌గ్గ‌ర‌కు తీసుకుని బిడ్డా అని ఏడుస్తుంది. అప్పుడే మ‌న‌సులో `ఇంత బంగారం లాంటి బిడ్డ నా పెన్విటిలో లోపం ఉంటే పుట్టేటిదా? మ‌రి స‌త్య‌ని నా పెన్విటి ఎందుకు మోసం చేస్తున్నాడు? ఆ విష‌యాన్ని నేను ఎలా నిల‌దీయాలి?` అనుకుని కుమిలిపోతుంది.

Also Read:స్టోర్ రూమ్ లో బందీగా మ‌ల‌బార్ మాలిని!

క‌ట్ చేస్తే .. స్కూల్ లో పిల్ల‌ల‌ని దిగ‌బెట్టేసి మాధ‌వ అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు. మాధ‌వ అలా వెళ్ల‌గానే ఆదిత్య పిల్ల‌ల ముందుకొస్తాడు. ప్రేమ‌గా మీకో గిఫ్ట్ అంటూ ట్యాబ్ అందిస్తాడు. రాత్రి అయ్యేస‌రికిదేవికి ఆద్య‌త కాల్ చేసి బాల్క‌నీలోకి రా.. అని పిలుస్తాడు. దేవి వెళ్ల‌గానే హ్యాపీ బ‌ర్త్ డే దేవి అనే బుడగ‌లు పైకి లేస్తాయి. అది చూసిన దేవి సంతోషిస్తుంది. ఇక గేట్ ద‌గ్గ‌రికి ర‌మ్మ‌ని దేవికి ఒక డ్రెస్ ఇచ్చిన ఇది రేపు వేసుకంటావా అమ్మా `అంటాడు ఆదిత్య‌.. ఇదంతా రుక్మిణి పై నుంచి చూస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.