English | Telugu

నా అగ్రిమెంట్లు నాకు ఇచ్చేయండ్రోయ్: నాగ‌బాబు

సోష‌ల్ మీడియా వేదిక‌గా సెటైర్లు వేస్తూ నిత్యం వార్త‌ల్లో నిలిచారు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు. ఆయ‌న గ‌త కొంత కాలంగా జ‌బ‌ర్ద‌స్త్ మేక‌ర్ల‌పై ఇండైరెక్ట్ గా సెటైర్లు వేస్తూనే వున్నారు. గ‌తంలో `జ‌బ‌ర్ద‌స్త్` షోకు రోజాతో క‌లిసి జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించిన నాగ‌బాబు ఆ త‌రువాత మేక‌ర్స్ కి త‌న‌కి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్త‌డంతో ఆ షో నుంచి బ‌య‌టికి వ‌చ్చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న `స్టార్ మా`లో `కామెడీ స్టార్స్ ధ‌మాకా` షోలో జ‌డ్జిగా వ్యవ‌హ‌రిస్తున్నారు.

జ‌న‌వ‌రి 23 నుంచి ప్ర‌తీ ఆదివారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ఈ కామెడీ షో ని కొత్త‌గా స‌రికొత్త హంగుల‌తో ప్రారంభించారు. అయితే తాజా ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని రిసెంట్ గా రిలీజ్ చేశారు. ఇందులో అగ్రిమెంట్ ల‌పై నాగ‌బాబు వేసిన సెటైర్లు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. గ‌తంలో జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్ కోసం మ‌ల్లెమాల తో అగ్రిమెంట్ చేసుకున్నారు. దానిపై చాలా సార్లు నాగ‌బాబు సెటైర్లు వేయ‌డ‌మే కాకుండా ఆ అగ్రిమెంట్ల‌పై ఘాటు విమ‌ర్శ‌లు కూడా చేశారు. జ‌బ‌ర్ద‌స్త్ నుంచి బ‌య‌టికి వ‌చ్చాక `అద‌రింది` షో చేసిన నాగ‌బాబు ఇందులోనూ మ‌ల్లెమాల‌పై సెటైర్లు వేయ‌డం తెలిసిందే.

`కామెడీ స్టార్స్ ధ‌మాకా` కోసం కిరాక్ ఆర్పీ ఓ స్కిట్ చేశాడు. అగ్రిమెంట్ల పై ఆర్పీ చేసిన స్కిట్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది. ప్రేమిస్తున్నాన‌ని త‌న ప్రేయ‌సి చెబితే కూడా అగ్రిమెంట్ రాయిస్తాడు. స‌మ్మ‌తి ప‌త్రం మీద సంత‌కం పెట్టు అని ఆర్పీ అంటాడు. అయితే `సంత‌కాలు పెట్టీ పెట్టీ చాలా మంది వ‌చ్చేశారు. ఎందుకురా మ‌న‌కీ సంత‌కాలు` అంటూ నాగ‌బాబు `జ‌బ‌ర్ద‌స్త్‌` అగ్రిమెంట్ ల‌పై సెటైర్ వేశారు. అంతే కాకుండా ఎవ‌డెవ‌డు ఏ అగ్రిమెంట్లు చూస్తున్నారో.. నా అగ్రిమెంట్లు నాకు ఇచ్చేయండ్రోయ్` అని ఈ సంద‌ర్భంగా మ‌రో సెటైర్ వేయ‌డం మ‌ళ్లీ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గ‌తంలో మ‌ల్లెమాల‌ కోసం తాను చేసిన అగ్రిమెంట్ల‌ని తిరిగి ఇచ్చేయండ‌ని డైరెక్ట్ గా నాగ‌బాబు కౌంట‌ర్ ఇచ్చార‌ని అంటున్నారు. నాగ‌బాబు అగ్రిమెంట్ల‌పై వేసి సెటైర్ల‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గామారింది.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.