స్టోర్ రూమ్ లో బందీగా మలబార్ మాలిని!
on Jan 21, 2022
.webp)
బుల్లితెర వీక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. నిరంజన్, డెబ్జాని మోడక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జీడిగుంట శ్రీధర్, బెంగళూరు పద్మ, ఆనంద్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సీరియల్ గత కొన్ని వారాలుగా మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. శుక్రవారం ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా సాగబోతోంది. పార్టనర్ ఇచ్చే కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఎక్కడ రద్దవుతుందోనని యష్ తనతో కొంత సేపు భార్యగా నటించమని వేదని కోరతాడు.
దీంతో ఖుషీ కోసం వేద సరే అంటుంది. ఇద్దరు కలిసి భోగిమంటల్లో పిడకలు వేస్తున్న దృశ్యాన్ని చూసిన వేద సోదరి తల్లి పండితారాధ్యుల సులోచనకు చెబుతుంది. దీంతో ఆగ్రహించిన వేద తల్లి సులోచన అసలు తన వేదకు పెళ్లే కాలేదని, యష్ కు తమకు ఎలాంటి సంబంధం లేదని యష్ ని అడ్డంగా బుక్ చేస్తుంది. కట్ చేస్తే.. శుక్రవారం ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా సాగనుందని తెలుస్తోంది.
Also read: సుకుమార్ దర్శకత్వంలో ధనుష్!
అంత మంది ముందు యష్ ని బుక్ చేసిందని అతని తల్లి మలబార్ మాలిని .. వేద తల్లి పండితారాధ్యుల సులోచనపై పగ పడుతుంది. తనకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఎదరుచూస్తూ వుండగా మాలినికి ఎదురుపడుతుంది సులోచన. దీంతో ఛాన్స్ దొరికిందని వేద తల్లిని దారుణంగా అవమానిస్తుంది. అయితే తనకూ సమయం దొరుకుతుందని ఎదురుచూసిన వేద తల్లి.. మలబార్ మాలిని స్టోర్ రూమ్ లోకి వెళ్లడం గమనించి తను లోనికి వెళ్లగానే తలుపులు మూసి గడియ వేస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? మలబార్ మాలిని ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంది? ఆ విషయం తెలిసి యష్ .. వేదతో గొడవకు దిగాడా? అన్నది తెలియాలంటే శుక్రవారం ఎపిసోడ్ చూడాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



