భర్తకు ఇస్తున్నంత తనకూ ఇవ్వాలన్న దీపిక.. మరొకర్ని చూసుకుంటున్న భన్సాలి!
'రామ్ లీల', 'బాజీరావ్ మస్తానీ', 'పద్మావత్'.. సంజయ్ లీలా భన్సాలి, రణవీర్ సింగ్, దీపికా పడుకోనే కాంబినేషన్లో వచ్చి, బాక్సాఫీస్ దగ్గర ఘనవిజయం సాధించిన సినిమాలు. వాళ్లు కలిసి పనిచేసి ప్రతిసారీ తెరపై మ్యాజిక్ ఆవిష్కృతమైంది. కొంత కాలంగా భన్సాలి డైరెక్షన్లో 'బైజు బావ్రా' వస్తుందనే టాక్ వినిపిస్తూ ఉంది. మొదట రణబీర్ కపూర్, కార్తీక్ ఆర్యన్ హీరోలుగా ఈ సినిమా తియ్యాలని భన్సాలి భావిస్తున్నట్లు ప్రచారంలోకి వచ్చింది.