English | Telugu
నిధితో సోను రొమాన్స్.. ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్!
Updated : Aug 10, 2021
సోను సూద్, నిధి అగర్వాల్ జంటగా నటించిన 'సాథ్ క్యా నిభావోగే' మ్యూజిక్ వీడియో సోమవారం విడుదలై, మ్యూజిక్ లవర్స్ ఆదరణను విశేషంగా పొందుతోంది. డైరెక్టర్-కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ సాంగ్‌ను పంజాబ్‌లోని లొకేషన్లలో చిత్రీకరించారు. విడిపోయిన ఇద్దరు ప్రేమికులు తిరిగి కలుసుకోవడం ఈ పాటలోని ప్రధానాంశం.
పచ్చని పొలాలతో కళకళలాడే ఊళ్లో ఉండే ఓ యువకుడు, ఓ అమ్మాయి ప్రేమలో పడి, పొలాల మధ్య ప్రేమ కబుర్లు చెప్పుకుంటారు. ఒకసారి ఆ అమ్మాయి కనిపించకుండా మాయమవడంతో ఆ యువకుడి గుండె పగులుతుంది. పోలీస్ ఆఫీసర్‌గా మారిన ఆ యువకుడు ఓ క్లబ్‌పై దాడిచేసినప్పుడు, అక్కడ బార్ డాన్సర్‌గా కనిపించిన తన ప్రేయసిని చూసి షాకవుతాడు. లవర్స్ ఇద్దరూ కలుసుకోవడంతో పాట ముగుస్తుంది.
ఈ సాంగ్‌లో సోను సూద్, నిధి అగర్వాల్ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. నిధి గ్లామర్ ఈ సాంగ్‌కు మంచి ఆకర్షణను తీసుకొచ్చింది. మ్యూజిక్ సెన్సేషన్ టోనీ కక్కర్ సంగీతం సమకూర్చి, పాటలను రాయడమే కాకుండా అల్తాఫ్ రజాతో కలిసి ఆలపించాడు. షిందా సింగ్ కొరియోగ్రఫీ అందించాడు. నిన్న ఈ పాటను రిలీజ్ చెయ్యగా ఇప్పటికే 7 మిలియన్ వ్యూస్ పైగా వచ్చాయి. ఈ వీడియోలో తమ హీరో కనిపించిన తీరుకు సోను ఫ్యాన్స్ ఎగ్జయిట్ అవుతున్నారు. నిధితో ఆయన రొమాన్స్‌ను ఆస్వాదిస్తున్నారు.
అల్తాఫ్ రాజా 90ల నాటి పాపులర్ ట్రాక్ 'తుమ్ తో తెహ్రీ పర్‌దేశీ' ఆధారంగా 'సాథ్ క్యా నిభావోగే' ట్రాక్‌ను టోనీ కక్కర్ రూపొందించాడు.