English | Telugu

పెళ్లిళ్ల పేరమ్మ‌గా తమన్నా!

త్వరలో తమన్నా పెళ్లిళ్ల పేరమ్మ‌గా తెర మీదకు రానుంది. హిందీ సినిమా 'ప్లాన్ ఎ ప్లాన్ బి'లో పెళ్లి సంబంధాలు కుదిర్చే వ్యక్తిగా మిల్క్ బ్యూటీ తమన్నా కనిపించనుంది. ఇతరులు పెళ్ళికి ఓకే అనేలా... ప్రేమలో పడేలా చూసే అమ్మాయిగా కథానాయిక కనిపిస్తుందని, ఆమె ప్రేమలో పడాలని కోరుకోదని ఈ సినిమాలో తన పాత్ర గురించి తమన్నా వివరించింది. ఈ సినిమాలో జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్ న్యాయవాది పాత్రలో కనిపించనున్నారు. త్వరలో ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది.

తమన్నాది కమర్షియల్ కథానాయిక కటౌట్! ఐదు పాటలు... ఆరు సన్నివేశాలు ఉన్న పాత్రలు చాలా చిత్రాల్లో చేసింది. తెరపై అందాల బొమ్మగా కనిపించింది. అటువంటి తమన్నా ఇప్పుడు కొత్త రూటులో ప్రయాణం చేయడం ప్రారంభించింది. ఓటీటీలకు పెరుగుతున్న ఆదరణ కూడా ప్రయోగాలు చేసే విధంగా ఆమెను ప్రోత్సహించింది. నెట్ ఫ్లిక్స్ కి తమన్నా చేసిన ఫస్ట్ సినిమా ఇది. ఆమె ఫస్ట్ ఓటీటీ మూవీ కూడా ఇదే. ఇంతకు ముందు తమన్నా ఓటీటీ కోసం '11 అవర్', 'నవంబర్ స్టొరీ' వెబ్ సిరీస్ లు చేసింది.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.