English | Telugu

బాయ్‌కాట్ రాధికా ఆప్టే! ట్విట్ట‌ర్ ట్రెండ్‌!!

బోల్డ్‌ సీన్స్‌ చేయడానికి ఏమాత్రం వెనుకాడని బాలీవుడ్‌ బ్యూటీస్‌లో రాధికా ఆప్టే పేరు తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు అదే ఆమెను ట్రోల్‌ చెయ్యడానికి కారణం అయ్యింది. తెలుగులో బాలకృష్ణ సరసన ‘లెజెండ్‌’, ‘లయన్‌’తో పాటు అంతకు ముందు ‘రక్త చరిత్ర’, ‘ధోని’లో రాధికా ఆప్టే యాక్ట్‌ చేశారు. ‘లయన్‌’ తర్వాత బాలీవుడ్‌ ఫిల్మ్స్‌, నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌లపై ఎక్కువ కాన్సంట్రేట్‌ చేశారు. బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవ్‌గణ్‌ ప్రొడ్యూస్‌ చేసిన ‘పార్చ్‌డ్‌’లో బోల్డ్‌గా నటించారు.

‘పార్చ్‌డ్‌’లో కొన్ని బోల్డ్‌ సీన్స్‌ ఉన్నాయి. కథానుగుణంగా శృంగారంలో పాల్గొనే సన్నివేశాల్లో రాధికా ఆప్టే నటించారు. ఇప్పుడు సడన్‌గా ఆ సీన్స్‌ను సోషల్‌ మీడియాలోకి తీసుకొచ్చారు కొందరు నెటిజన్స్‌. వాటిని చూపిస్తూ రాధికా ఆప్టేను బాయ్‌కాట్‌ చెయ్యాలని పిలుపు ఇస్తున్నారు. భారతీయ సంస్కృతికి ఆ సీన్స్‌ వ్యతిరేకమని, అందువల్లే బాయ్‌కాట్‌ చెయ్యాలని చెబుతున్నారు.

అయితే, గతంలోనే ఆ సీన్స్‌ గురించి రాధికా ఆప్టే స్పందించారు. బాలీవుడ్‌లో ఉన్నప్పుటు అటువంటి సీన్స్‌ చెయ్యాలని సెలవిచ్చారు. సోషల్‌ మీడియాలో ఆ సీన్స్‌ వైరల్‌ అయినప్పుడు, తన ఫొటోలతో మార్ఫింగ్‌ చేసి కొన్ని న్యూడ్‌ పిక్స్‌ వచ్చినప్పుడు దాచడానికి ఇంకేముందని అనుకున్నానని రాధికా ఆప్టే చెప్పుకొచ్చారు. కొంతమంది నుండి ఆ సన్నివేశాలపై వ్యతిరేకత వచ్చినా, పలుచోట్ల రాధికా ఆప్టేకు ప్రశంసలు లభించాయి.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.