English | Telugu

బ్రిటిష్ యువ‌రాణి డ‌యానా క‌థతో రూపొందిన 'స్పెన్స‌ర్' రిలీజ్ డేట్ ఫిక్స్‌డ్‌!

ప్రిన్సెస్ డ‌యానాగా క్రిస్టెన్ స్టివార్ట్ మెయిన్ క్యారెక్ట‌ర్ చేసిన 'స్పెన్స‌ర్' మూవీని న‌వంబ‌ర్ 5న థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయాల‌ని నిర్మాణ సంస్థ‌లు నియాన్‌, టాపిక్ స్టూడియోస్ నిర్ణ‌యించాయి. మోస్ట్ యాంటిసిపేటెడ్ మార్వెల్ మూవీ 'ఎట‌ర్న‌ల్స్' కూడా అప్పుడే రిలీజ‌వుతుండ‌టం గ‌మ‌నార్హం. అంటే 'ఎట‌ర్న‌ల్స్‌'తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర 'స్పెన్స‌ర్' ఢీకొట్ట‌బోతోంద‌న్న మాట‌.

"ప్రిన్సెస్ డయానా (స్టివార్ట్‌), ప్రిన్స్ చార్లెస్ (జాక్ ఫార్థింగ్) వివాహం చాలా కాలం నుండి బ‌య‌ట‌కు రావ‌డానికి ఎదురుచూస్తోంది" అని తెలిపింది అఫిషియ‌ల్ సినాప్సిస్‌. "ప‌లు వ్యవహారాలు, విడాకుల పుకార్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, క్వీన్స్ సాండ్రింగ్‌హామ్ ఎస్టేట్‌లోని క్రిస్మస్ వేడుక‌లు ప్ర‌శాంతంగా జ‌ర‌గాల‌ని నిర్దేశించబడింది. ఆ వేడుక‌ల్లో తినడం, తాగడం, షూటింగ్, హంటింగ్ వంటి అంశాలున్నాయి. డయానాకు ఆ ఆట తెలుసు. కానీ ఈ సంవత్సరం, అందులోని విషయాలు చాలా భిన్నంగా ఉంటాయి. 'స్పెన్సర్'లో విధి నుంచి త‌ప్పించుకోలేని ఆ కొన్ని రోజుల్లో ఏమి జరిగి ఉంటుందో ఊహాత్మ‌కంగా చూపించాం." అని నిర్మాత‌లు వెల్ల‌డించారు.

పాబ్లో ల‌రైన్ (జాకీ, నెరూడా, లైసీస్ స్టోరీ) డైరెక్ట్ చేసిన ఈ మూవీకి ఆస్కార్ నామినీ స్టీవెన్ నైట్ (డ‌ర్టీ ప్రెటీ థింగ్స్‌, ఈస్ట‌ర్న్ ప్రామిసెస్‌, లాకే) ర‌చ‌న చేశాడు. క్రిస్టెన్ స్టివార్ట్‌తో పాటు 'బాఫ్తా' నామినీ తిమోతీ స్పాల్ (మిస్ట‌ర్ ట‌ర్న‌ర్‌, సీక్రెట్స్ అండ్ లైస్‌), జాక్ ఫార్థింగ్ (పోల్డార్క్‌, ద ర‌య‌ట్ క్ల‌బ్‌), షాన్ హారిస్ (మిష‌న్ ఇంపాజిబుల్ ఫిలిమ్స్‌, ద గ్రీన్ నైట్‌), అకాడ‌మీ అవార్డ్ నామినీ సాలీ హాకిన్స్ (ద షేప్ ఆఫ్ వాట‌ర్‌, బ్లూ జాస్మిన్‌) న‌టించారు.

జువాన్ డి డ‌యోస్ ల‌రైన్‌, జోనాస్ డార్న్‌బాచ్‌, పాల్ వెబ్‌స్ట‌ర్‌, జ‌నైన్ జాకోవ్‌స్కీ, మారెన్ అడే ఈ మూవీని నిర్మించారు.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.