English | Telugu

భర్త అరెస్ట్‌ తర్వాత తొలిసారి సెట్స్‌కొచ్చిన శిల్పాశెట్టి!

సరిగ్గా నెల తర్వాత శిల్పాశెట్టి ఇంటి నుంచి బయటకొచ్చారు. తొలిసారి సెట్స్‌కు వ‌చ్చారు. షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. అందువల్ల, సెట్‌లో ఆమె కొంత ఎమోషన్‌ కూడా అయ్యారని సన్నిహితుల కథనం. ప్రముఖ హిందీ కథానాయిక శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రాను జూలై 19న ముంబై పోలీసులు పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్‌ చేశారు. అప్పట్నుంచి శిల్పాశెట్టి ఇంట్లో ఉన్నారు. షూటింగ్స్‌ అన్నీ క్యాన్సిల్‌ చేసుకున్నారు.

తనపై మీడియాలో కథనాలు రాకుండా చూడాలని తొలుత కోర్టును కోరారు. అలా చేయడం కుదరదని తేలింది. ఆ తర్వాత మీడియా కథనాలపై, ట్రోల్స్‌పై ఆగస్ట్‌ 2న ఓ పోస్ట్‌ చేశారు. భారత న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందనీ, కేసు నుంచి బయటపడతామని, అప్పటివరకూ తమ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించమని అందులో పేర్కొన్నారు. శిల్పాకు మద్దతుగా ఎవరూ లేరా? అంటే... ఉన్నారు.

ఎవరెంత మద్దతు ఇచ్చినా భర్త అరెస్ట్‌ తర్వాత శిల్పాశెట్టి డిస్ట్రబ్‌ అయ్యారనేది బాలీవుడ్‌ వర్గాలు చెప్పే మాట. అందుకే, బయటకు రాలేదు. ‘హంగామా–2’ ఓటీటీలో విడుదలైనా ప్రమోషన్స్‌కు అటెండ్‌ కాలేదు. షూటింగ్స్‌ చెయ్యలేదు. సడన్‌గా షూటింగ్స్‌కు రాలేనని చెప్పడంతో హిందీ డ్యాన్స్‌ రియాలిటీ షో ‘సూపర్‌ డ్యాన్సర్‌’ టీమ్‌ గెస్ట్‌ జడ్జ్‌లను వెతుక్కోవలసి వచ్చింది. ఇప్పుడు నెల తర్వాత శిల్పాశెట్టి డ్యాన్స్‌ షోకు మళ్లీ వచ్చారు. షూట్‌ చేశారు.

‘‘పిల్లల కోసమో, ఫ్యామిలీ కోసమో కాదు... తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడం కోసం శిల్పాశెట్టి మళ్లీ షూటింగ్‌కు వచ్చారు. ‘సూపర్‌ డ్యాన్సర్‌’ టీమ్‌ ఆమెకు సాదర స్వాగతం పలికింది. ఉదయం ఆమె చాలా ఎమోషనల్‌ అయ్యారు’’ అని డ్యాన్స్‌ రియాలిటీ షో యూనిట్‌ వర్గాలు తెలిపాయి.

కాగా బుధ‌వారం రాజ్ కుంద్రాకు బాంబే హైకోర్టు వారం రోజుల పాటు మ‌ధ్యంత‌ర బెయిల్ మ‌జూరు చేసింది.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.