English | Telugu

విజ‌య్ సేతుప‌తి సైలెంట్ హిందీ ఫిల్మ్‌!

త‌మిళ స్టార్ యాక్ట‌ర్ విజ‌య్ సేతుప‌తి ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా ప‌లు భాష‌ల్లో ఔట్‌స్టాండింగ్ ప‌ర్ఫార్మెన్స్ ఇస్తూ వ‌స్తున్నాడు. క్యారెక్ట‌ర్ ఏదైనా సేతుప‌తి చేశాడంటే దానికో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ వ‌స్తోంది. 'సూప‌ర్ డీల‌క్స్‌'లో ట్రాన్స్‌జెండ‌ర్‌, 'ఉప్పెన‌'లో హీరోయిన్ తండ్రి, 'మాస్ట‌ర్‌'లో విల‌న్ క్యారెక్ట‌ర్ ఇందుకు నిద‌ర్శ‌నం. ఇప్పుడు అత‌ని దృష్టి హిందీ బెల్ట్ మీద ప‌డింది. రాజ్ అండ్ డీకే డైరెక్ష‌న్‌లో ఇప్ప‌టికే అత‌ను ఓ హిందీ వెబ్ సిరీస్‌లో న‌టిస్తున్నాడు.

లేటెస్ట్‌గా 'గాంధీ టాక్స్' అనే హిందీ ఫిల్మ్‌లో విజ‌య్ సేతుప‌తి న‌టిస్తున్న‌ట్లు తెలిసింది. మ‌రాఠీ ద‌ర్శ‌కుడు కిశోర్ పాండురంగ్ బేలేక‌ర్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో సేతుప‌తికి సింగిల్ డైలాగ్ కూడా ఉండ‌దు. అలాగ‌ని అత‌నిది మూగ పాత్ర కాదు. ఇది సైలెంట్ ఫిల్మ్‌! గ‌తంలో క‌మ‌ల్ హాస‌న్‌, అమ‌ల జంట‌గా సింగీతం శ్రీ‌నివాస‌రావు రూపొందించిన 'పుష్ప‌క విమానం' సైలెంట్ ఫిల్మ్ అని తెలిసిందే. అది క్లాసిక్‌గా పేరు తెచ్చుకుంది.

"ఒక న‌టుడికి మాట‌ల కంటే మౌనం ఎప్పుడూ లౌడ‌ర్‌గా ఉంటుంద‌ని నేనెప్పుడూ న‌మ్ముతాను. క‌నీసం నాకు సంబంధించినంత వ‌ర‌కూ ఇది నిజం. నేను మౌనంగా ఉన్న‌ప్పుడే ఎక్కువ‌గా ఎక్స్‌ప్రెసివ్‌గా క‌నిపిస్తాను." అని చెప్పాడు సేతుప‌తి. 'గాంధీ టాక్స్‌'లో విజ‌య్ స‌ర‌స‌న అదితిరావ్ హైద‌రి న‌టిస్తోంది. విశేష‌మేమంటే ఇదివ‌ర‌కే మ‌ల‌యాళం సినిమా 'సూఫియుమ్ సుజాత‌యుమ్‌'లో ఆమె మూగ అమ్మాయిగా న‌టించింది.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.