English | Telugu

బిగ్‌బి మనవడు.. షారుక్ కూతురు.. శ్రీదేవి కూతురు!

బాలీవుడ్ బడా బడా సూపర్‌స్టార్లు ఎవరైనా సరే తమ పిల్లలను భారీ సినిమాతో ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చెయ్యాలని చూస్తారు. కానీ, అందుకు భిన్నంగా డిజిటల్ ప్రాజెక్ట్‌తో బిగ్ బి మనవడు, బీటౌన్ బాద్షా కూతురు, అతిలోక సుందరి కుమార్తెను ఇంట్రడ్యూస్ చెయ్యాలని చూస్తున్నారా? అంటే... 'అవును' అనే సమాధానం వినబడుతోంది. అసలు వివరాల్లోకి వెళితే...

ఇంటర్నేషనల్ కామిక్ బుక్ 'ఆర్చి' ఆధారంగా ప్రముఖ హిందీ దర్శకురాలు జోయా అఖ్త‌ర్ ఓ డిజిటల్ ప్రాజెక్ట్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవడు (కూతురి కుమారుడు) అగస్త్య నంద, షారుక్ ఖాన్ కూతురు సుహానా, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, అతిలోక సుందరి శ్రీదేవి దంపతుల రెండో కుమార్తె ఖుషి కపూర్ నటిస్తున్నారని బాలీవుడ్ న్యూస్.

షారుక్ కుమార్తె సుహానాను జోయా అఖ్త‌ర్ పరిచయం చేస్తున్నారని రెండుమూడు రోజులుగా బాలీవుడ్ కోడై కూస్తోంది. సుహానా మాత్రమే కాదు, అగస్త్య నంద, ఖుషి కపూర్ ను ఇంట్రడ్యూస్ చేసే బాధ్యతను జోయా తీసుకున్నారట. ఆర్చి పాత్రలో అగస్త్య, బెట్టిగా సుహానా, వేరోనికాగా ఖుషి కనిపిస్తారట.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.