అలనాటి ముచ్చట.. జయబాధురిని ఇంటర్వ్యూ చేసిన చంద్రకళ!
ఒక ప్రాంత ప్రముఖతార, మరో ప్రాంత ప్రముఖ నటిని కలుసుకొని, ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది? అలాంటి సందర్భాలు చాలా అరుదుగా సంభవిస్తుంటాయి. అలా తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల పముఖ నటి చంద్రకళ, హిందీ సినిమాల పాపులర్ నటి జయబాధురి (జయా బచ్చన్) మీటింగ్ జరిగింది. హిందీ సినిమా 'గాయ్ ఔర్ గౌరీ' షూటింగ్ నిమిత్తం అందులో హీరో హీరోయిన్లుగా నటించిన శత్రుఘ్న సిన్హా, జయబాధురి మద్రాస్‌కు వచ్చారు.