Read more!

English | Telugu

ఫ్లాష్ బ్యాక్ః సుమ‌న్ కి మూడు సార్లు క‌లిసొచ్చిన మే 30!

తెలుగు ప్రేక్ష‌కుల‌ను విశేషంగా అల‌రించిన అందాల న‌టుల్లో సుమ‌న్ ఒక‌రు. 80, 90ల్లో సుమ‌న్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ప‌లు చిత్రాలు విజ‌య‌ప‌థంలో ప‌య‌నించాయి. వాటిలో `20వ శ‌తాబ్దం`, `పెద్దింట‌ల్లుడు`, `నాయుడు గారి కుటుంబం` వంటి సినిమాలు కూడా ఉన్నాయి. 90ల్లో జ‌నం ముందు నిలిచిన ఈ మూడు చిత్రాలకు సంబంధించి ఒక కామ‌న్ ఫ్యాక్ట‌ర్ ఉంది. అదేమిటంటే.. ఈ మూడు జ‌న‌రంజ‌క సినిమాలు కూడా వేర్వేరు సంవ‌త్స‌రాల్లో ఒకే తేదిన సంద‌డి చేశాయి.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. శ‌తాధిక చిత్రాల ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ కాంబినేష‌న్ లో సుమ‌న్ న‌టించిన యాక్ష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్ `20వ శ‌తాబ్దం`.. 1990 మే 30న విడుద‌లైంది. ``అమ్మ‌ను మించిన దైవ‌మున్న‌దా`` అనే పాపుల‌ర్ సాంగ్ ఈ సినిమాలోనిదే. ఇక ఇదే మే 30న 1991లో సుమ‌న్ నుంచి మ‌రో చిత్రం వ‌చ్చింది. అదే.. `పెద్దింట‌ల్లుడు`. ఒక‌ప్ప‌టి అగ్ర క‌థానాయిక న‌గ్మా న‌టించిన తొలి తెలుగు చిత్ర‌మిది. శ‌ర‌త్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో వాణిశ్రీ‌, మోహ‌న్ బాబు ఇత‌ర‌ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఆక‌ట్టుకున్నారు. ఇక సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌లో సుమ‌న్ న‌టించిన స‌క్సెస్ ఫుల్ మూవీ `నాయుడు గారి కుటుంబం` కూడా 1996లో ఇదే మే 30న రిలీజైంది. రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు ఓ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రాన్ని బోయిన సుబ్బారావు డైరెక్ట్ చేశాడు. మొత్త‌మ్మీద‌.. మే 30న ఆరేళ్ళ వ్య‌వ‌ధిలో ముచ్చ‌ట‌గా మూడు హిట్స్ చూసి వార్త‌ల్లో నిలిచారు సుమ‌న్.