English | Telugu

గోవా బీచ్‌లో సూర్యుడు.. పోగేసుకుంటున్న లాస్య!

  ఒకప్పుడు బుల్లితెర మీద యాంకర్ గా వ్యవహరించిన లాస్య గురించి తెలియని వారంటూ ఎవరూ లేరు.  ఒక మ్యూజిక్ ఛానల్ లో యాంకర్ రవితో పాటు సహా యాంకర్ గా పని ఛేల్సింది. ఏనుగు - చీమ కథలతో లాస్య అప్పట్లో ఫుల్ ఫేమస్ కూడా. అలాంటి లాస్య పెళ్లి, పిల్లలు అంటూ  ఫామిలీ  లైఫ్ తో బిజీ ఐపోయి యాంకరింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఐతే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. రీసెంట్ గా గోవా వెళ్ళింది తన బాబుని తీసుకుని. అక్కడ ఎన్నో  జ్ఞాపకాలను పోగు చేసుకుంది. వెళ్లి గోవా బీచ్ లో  తన బాబుతో  తడి ఇసుకలో కూర్చుని సూర్యుడి బొమ్మ వేసి కళ్ళజోడు పెట్టి ఫన్నీగా అల్లరి చేస్తూ కనిపించింది.

Karthika Deepam2 : పిల్లలు అబద్ధాలు చెప్పరు.. నేనే కదా నిన్ను తీసుకొచ్చాను, థాంక్యూ సో మచ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -69 లో..  కార్తిక్ కి శౌర్య కాల్ చేస్తుంది. ఇక అదే సమయంలో అక్కడికి జ్యోత్స్న వచ్చి.. శౌర్య ఫోన్ తీసుకొని వింటుంది. ఊరికే ఫోన్ మాట్లాడుకోవడం కాదు.. నీకు కానీ మీ అమ్మకి కానీ ఏదైనా అవసరం ఉంటే వెంటనే ఫోన్ చేయమని కార్తిక్ అంటాడు. ఆ మాట జోత్స్స వినేస్తుంది. ఇంతలో దీప వచ్చి.. శౌర్య ఎవరితో మాట్లాడుతుంది.. ఆ ఫోన్ జోత్స్న ఎందుకు తీసుకుందని ఆలోచిస్తుంటుంది. మీ అమ్మకి ఆత్మాభిమానం ఎక్కువ.. ఏదీ అడగదు.. మీ అమ్మకి ఏం కావాలన్నా నువ్వే నాతో చెప్తుండాలని కార్తిక్ అంటాడు. ఆ మాట విన్న జోత్స్న.. నీ నుంచి ఇది అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేదు బావా అని అనుకుంటుంది.

Guppedantha Manasu : మినిస్టర్ కి రాజీనామా పత్రం ఇచ్చింది.. అంతా తనకోసమే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1099 లో....వసుధారకి రిషి ఇచ్చిన గిఫ్ట్ హార్ట్ సింబల్..అది చూస్తూ ఎమోషనల్ అవుతుంది. అప్పుడే వసుధార దగ్గరికి మను వచ్చి ఏం నిర్ణయం తీసుకున్నారు. అసలేం చేయబోతున్నారని అడుగుతాడు. నా నిర్ణయం అందరి ముందు చెప్తాను.. కొన్ని నిర్ణయలు అందరి ముందు చెప్పాలని వసుధార అంటుంది. బోర్డు మీటింగ్ లో అందరితో పాటు మీకు కూడా తెలుస్తుందని వసుధార అంటుంది. అందరితో పాటు నాక్కూడా తెలుస్తుంది కానీ ఇప్పుడు చెప్పండని మను అంటాడు. నేనేం చావను.. రిషి సర్ ఉన్నంత వరకు నేను బాగుంటానని వసుధార ఎమోషనల్ అవుతుంది.

టేస్టీ తేజకి సర్ ప్రైజ్ ఇచ్చిందెవరో తెలుసా!

బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన వారిలో తేజ ఒకడు. తేజ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయక ముందు  జబర్దస్త్ లో కమెడియన్ గా నటించాడు. ఐతే ఈరోజు తేజ ఇలా ఒక సెలబ్రిటీ స్థాయికి రావడానికి కారణం జబర్దస్త్ టీమ్ లీడర్ అదిరే అభి అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆయన లేకపోతే తనసలు ప్రజలకు తెలిసేవాడినే కాదన్నారు తేజ. ఇటు బుల్లితెరతో పాటు అటు సోషల్ మీడియాలో కూడా తేజకు మంచి ఫాలోయింగ్ ఉంది.  తేజ తన యూట్యూబ్ ఛానెల్ లో 200కి పైగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినిమాలను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రమోట్ చేశాడు. ఐతే జబర్దస్త్ లో కనిపించినా, బిగ్ బాస్ లో కనిపించినా ఫ్యూచర్ చాల బ్రైట్ గా ఉంటుంది అనడానికి చాలా మంది ఉదాహరణులుగా ఉన్నారు.

కూతురి కోసం ఒక చెట్టు...

మొదట సీరియల్ నటుడుగా మెప్పించిన అలీ రెజా తర్వాత  బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్ గా వెళ్లి అక్కడ కూడా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసాడు. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా అలరించాడు. అలీ రెజా విన్నర్ గా  రేస్‌లోకి వచ్చాడు. కానీ ఎలిమినేట్ ఐపోయాడు. ఆ తరువాత వైల్డ్ కార్డ్ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు కానీ.. విన్నర్ రేస్‌లో నిలవలేకపోయాడు. అలాంటి అలీ రెజా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు..రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక వీడియోని పోస్ట్ చేసాడు. అదేంటంటే తన ఇంటి పెరట్లో ముద్దుల కూతురు అమైరాతో కలిసి మామిడి మొక్క, అరటి చెట్టును పాతాడు. తన కూతురి చేత మొక్కలకు మట్టి వేయించి నీళ్లు కూడా పోయించాడు. అలాగే తన పెరట్లో ఉన్న జామకాయ చెట్టు నుంచి దోరగా పండిన జామకాయ తీసుకుని తిన్నాడు.

సింగర్ గా మారనున్న ఫైమా ? ఏ మూవీలో పాడుతోందంటే ...  

పటాస్ ఫైమా గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ లో తన స్కిట్స్ తో నవ్విస్తూ ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్ మెంట్ ని అందిస్తూ ఉంటుంది.అలాగే ఫైమా ఇన్స్టాగ్రామ్ లో చేసే రీల్స్ ఐతే బీభత్సంగా పేలతా ఉంటాయి. సోషల్ మీడియాలో ఫైమా బాగా వైరల్ అవుతూ ఉంటుంది. అలాంటి ఫైమా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఆస్క్ మీ ఏ క్వశ్చన్ అంటూ ఫాన్స్ కి అడిగింది. ఇక నెటిజన్స్ అంతా కూడా ఫైమా సింగింగ్ మీదే ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఈ మధ్య ఫైమా తన కార్ లో కొత్త బాయ్ ఫ్రెండ్ ప్రవీణ్ నాయక్ తో వెళ్తూ కొత్త కొత్త సాంగ్స్ ని పాడుతోంది. అలాగే కొత్త కొత్త సాంగ్స్ కి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి డాన్స్ కూడా చేస్తూ ఆ రీల్స్ ని తన ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేస్తోంది. అవి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ని కూడా సొంతం చేసుకుంటున్నాయి.

Karthika Deepam2 : పారు మోసం.. కొత్త హీరోయిన్ తో కథలో మలుపు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -68  లో.. నీకు చెప్పింది ఏంటి? నువ్వు చేసింది ఏమిటి? అని పారిజాతాన్ని నిలదీస్తాడు కార్తీక్. దాంతో పారిజాతం తన మనసులో ఉన్న కుట్ర మొత్తాన్ని కక్కేస్తుంది. నేను చేసింది తప్పైతే.. దీప విషయంలో నువ్వు చేసింది ఏంటి? దీప నీకు ముందే తెలుసని ఎందుకు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదో.. నువ్వు నీ నోటితో చెప్పకపోయినా.. నేను అర్ధం చేసుకోగలనని పారిజాతం అంటుంది. నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావ్ పారూ.. ఇలాంటి లేనిపోనివి ఊహించుకుని దీపని ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలని చూస్తున్నావ్.. పాయసంలో మందు కలిపావ్.. ఆ రోజు బంటుగాడితో దీప బ్యాక్‌లో నెక్లెస్ పెట్టించావ్.. జోత్స్న మనసుని చెడగొడుతున్నది కూడా నువ్వేనని కార్తిక్ అంటాడు. 

Eto Vellipoyindhi Manasu : ప్రమాదం నుండి భార్యని కాపాడుకున్న భర్త.. ఇది అత్త ప్లానేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -120 లో....రామలక్ష్మికి ఏమైనా అవుతుందేమోనని సీతాకాంత్ భయపడుతుంటే మరొకవైపు సందీప్ , మాణిక్యం ఇద్దరు గొడవ పడతారు.  దాంతో సీతాకాంత్ కోపంగా అందరు ఇక్కడ నుండి వెళ్లిపోండి.. రామలక్ష్మికి ఈ సిచువేషన్ రావడానికి కారణం మీరే అని సీతాకాంత్ కోప్పడతాడు. మా అమ్మాయిని ఆ సిచువేషన్ లో  వదిలేసి ఎలా బయటకు వెళ్తామని సుజాత అనగానే.. రామలక్ష్మి ని చూసుకోవడం నా బాధ్యత మీరు వెళ్ళండని మాణిక్యం వాళ్ళని బయటకు పంపిస్తాడు సీతాకాంత్.