English | Telugu

అల్లు అర్జున్ స్టార్ గా ఎదగడం వెనక ఖాదర్ హసన్ ఉన్నాడు 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)కి మలయాళ చిత్రసీమలో ఉన్న క్రేజ్ ఏ పాటిదో తెలిసిందే. 2004లో విడుదలైన 'ఆర్య'(Arya)నుంచి పుష్ప 2(Pushpa 2)వరకు దాదాపుగా అన్ని చిత్రాలకి మలయాళ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో పుష్ప 2 మలయాళంలో విడుదలైనప్పుడు, అక్కడి సొంత హీరోలు సైతం తమ కొత్త సినిమా రిలీజ్ డేట్ ని వాయిదా వేసుకున్నాయి. దీన్ని బట్టి మలయాళ బాక్స్ ఆఫీస్ వద్ద అల్లు అర్జున్ కి ఉన్న చరిష్మా ని అర్ధం చేసుకోవచ్చు. ఈ ఇరవై ఏళ్లలో ఎంతో మంది అభిమానులు కూడా ఏర్పడటంతో పాటు, వాళ్లంతా మల్లు అర్జున్(Mallu Arjun)అని ప్రేమతో పిలుచుకుంటారు.

ప్రముఖ మలయాళీ చిత్ర నిర్మాత 'ఖాదర్ హసన్'(Khader hassan)రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'ఆర్య' సినిమా పాటలు విని అల్లుఅర్జున్ మలయాళ ప్రేక్షకుల్లో పేరు సంపాదిస్తాడని అనిపించింది. తెలుగులో సినిమా రిలీజ్ అయ్యాక దిల్ రాజు ని కలిసి డబ్బింగ్ వర్షన్ అడిగితే ఇవ్వలేదు. ఆ తర్వాత ఒప్పించి ఆర్య హక్కులని పొంది మలయాళీ ప్రేక్షకులకి తగ్గట్టుగా డైలాగులు రాయించాను. మిక్సింగ్ తో పాటు ఇతర సాంకేతిక అంశాలని 'చెన్నై'లోని ప్రతిష్టాత్మక 'భరణి స్టూడియో'లో చేయించాను. మలయాళ చిత్ర సీమలో బాగా పేరు పొందిన సింగర్స్ చేత సాంగ్స్ పాడించాను.

ట్రైలర్, సాంగ్స్ ని విసృతంగా ప్రచారం చేయడానికి ఆసియానెట్ కేబుల్, లోకల్ కేబుల్ టీవీ తో ఒప్పందం చేసుకున్నాను. మూవీ చూడటానికి విద్యార్థులని ఆహ్వానిస్తు కళాశాలల్లోని యూనియన్లని సంప్రదించాను. అల్లు అర్జున్ పేరుతో ఉన్న స్టిక్కర్లు, మాస్క్ లని చిన్న పిల్లలకి చేరువయ్యేలా చేశాను. మూవీ రిలీజ్ అయ్యాక మంచి విజయాన్ని అందుకుకోవడమే కాకుండా ఊహించని విధంగా లాభాలు వచ్చాయి. చాలా ఏరియాల్లో మూవీ వంద రోజులు ఆడింది. ఆర్య విజయం తర్వాత అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు కూడా మలయాళీలని బాగా ఆకట్టుకున్నాయి.ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన చాలా సినిమాలు విడుదల చేస్తే మంచి విజయాన్ని అందుకున్నాయి. అల్లు అర్జున్ ఇప్పటికి నన్ను ఒక సోదరుడిగా చూస్తాడని ఖాదర్ చెప్పుకొచ్చాడు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.