English | Telugu

థియేటర్ రిలీజ్ క్యాన్సిల్ చేసి ఓటిటిలోకి వస్తున్నాం..దేశమే మాకు ముఖ్యం 

థియేటర్ రిలీజ్ క్యాన్సిల్ చేసి ఓటిటిలోకి వస్తున్నాం..దేశమే మాకు ముఖ్యం 

రాజ్ కుమార్ రావు(Rajkummar Rao)వామికా గబ్బి(Wamiqa Gabbi)ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ 'భూల్ ఛుక్ మాఫ్'(Bhool Chuk Maaf). కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీని మాడాక్ ఫిల్మ్స్ పతాకంపై  ఇటీవల 'చావా'(Chhaava)తో భారీ విజయాన్ని అందుకున్న దినేష్ విజయన్ నిర్మిస్తుండగా, కరణ్ శర్మ(karan Sharma) దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. సీమా పెహ్వ, సంజయ్ మిశ్ర, జాకిర్ హుస్సేన్, రఘుబీర్ యాదవ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

ఈ మూవీ మే 9 శుక్రవారం వరల్డ్ వైడ్ గా విడుదల కావాల్సి ఉంది. కానీ 'ఆపరేషన్ సింధూర్' తర్వాత దేశ వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా థియేటర్స్ లో కాకుండా నేరుగా ఓటిటిలో విడుదల కాబోతుంది.  ఈ మేరకు మేకర్స్ అధికారకంగా ఒక ప్రకటన విడుదల చేస్తు 'భూల్ ఛుక్ మాఫ్' ని థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నాం. కానీ దేశస్ఫూర్తికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ, ఈ నెల 16 నుంచి అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని తెలిపింది.

రాజ్ కుమార్ రావు 2011 లో విడుదలైన 'రాగిణి ఏంఏంఎస్' మూవీతో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన పాత్రలని పోషించి హిందీ చిత్ర సీమలో అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన నటుల్లో ఒకడిగా ఎదిగాడు. ప్రత్యేకించి కామెడీ  ప్రయోగాత్మక చిత్రాలకి పేరు గాంచిన రాజ్ కుమార్ గత ఏడాది స్త్రీ 2 , విక్కీ విద్యా కా వహ్ వాలా వీడియో అనే చిత్రాల ద్వారా మంచి విజయాల్ని అందుకున్నాడు. రాజ్ కుమార్ రావు నుంచి ఇప్పటి వరకు సుమారు నలభైకి పైగా చిత్రాలు వచ్చాయి

.

 

థియేటర్ రిలీజ్ క్యాన్సిల్ చేసి ఓటిటిలోకి వస్తున్నాం..దేశమే మాకు ముఖ్యం