English | Telugu

డాన్స్ ఐకాన్ సీజన్ 2 విన్నర్.. క్యాష్ ప్రైజ్ ఎంతంటే..?

డాన్స్ ఐకాన్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలే చాలా ధూమ్ ధామ్ గా జరిగింది. ఈ ఎపిసోడ్ కి సాయి ధరమ్ తేజ్ గెస్ట్ గా వచ్చాడు. అలాగే "వచ్చినవాడు గౌతమ్" మూవీ టీమ్ నుంచి అశ్విన్ కూడా ఈ షోకి వచ్చాడు. ఈ మూవీ టీజర్ కూడా ఈ షోలో రిలీజ్ చేశారు. ఇక ఈ ఫైనల్ ఎపిసోడ్ లో విన్నర్ ని తప్పించి మిగతా ఓడిపోయిన వాళ్ళను జడ్జెస్ రమ్యకృష్ణ, శేఖర్ మాష్టర్, ఫారియా వచ్చి ఒక్కొక్కరినీ బయటకు తీసుకెళ్ళిపోగా ఫైనల్ గా యష్ మాష్టర్ - బినితా మాత్రమే మిగిలారు. వీళ్ళు టైటిల్ ని సొంతం చేసుకున్నారు. సాయి ధరమ్ తేజ్ వీళ్లకు ట్రోఫీని అందించారు.

బినితా 8,58,771 ఓట్స్ తో ఫస్ట్ ప్లేస్ ని సొంతం చేసుకుంది. ఇక సెకండ్ ప్లేస్ లో ప్రాకృతి-బర్కత్ టీమ్ 6,81,278 ఓట్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఐతే బర్కత్ ఈ ఎపిసోడ్ రాలేకపోయింది. అలాగే అన్ని ఎపిసోడ్స్ లో బినితాకి డాన్స్ కొరియోగ్రాఫ్ చేసిన కృష్ణని యష్ మాష్టర్ స్టేజి మీదకు పిలిచాడు. ఆ ట్రోఫీ పట్టుకుని కృష్ణ ఎంతో ఆనందం వ్యక్తం చేసాడు. సీజన్ 1 లో ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాను. ఎలాగైనా ఫస్ట్ ప్లేస్ కి రావాలి అనుకున్నాను అలాగే బినిత దొరికింది చాల హార్డ్ వర్క్ చేసింది ఎంతో సపోర్ట్ చేసింది అని చెప్పాడు కృష్ణ. అలాగే బినితాకి 5 లక్షల క్యాష్ ప్రైజ్ కూడా అందించారు.

అలాగే "వచ్చినవాడు గౌతమ్" మూవీ ప్రొడ్యూసర్ కి బినిత అంటే చాలా ఇష్టం అని అందుకే మూవీ టీమ్ తరపున మరో 5 లక్షల క్యాష్ ప్రైజ్ కూడా అందించారు. అలాగే సాయి ధరమ్ తేజ్ చిన్నపిల్లలైన బర్కత్ , బినితా కోసం రెండు టెడ్డి బేర్స్ ని తెచ్చి ప్రెజెంట్ చేశారు. ఇలా ఈ సీజన్ ఇక్కడితో ఎండ్ ఐపోయింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.