English | Telugu
హిస్టరీ రిపీట్ అంటున్న బాలకృష్ణ ..అన్‌స్టాపబుల్ యాంథమ్ సీజన్ 2 రిలీజ్
Updated : Sep 28, 2022
నందమూరి బాలకృష్ణ నటుడిగా, నిర్మాతగా, డైరెక్టర్ గా ఎంతో మందిని అలరించారు..అలరిస్తూనే ఉన్నారు..ఇక ఇప్పుడు ఆహా వారి అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షో తో హోస్ట్‌గా మారి విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. ఇక ఇప్పుడు ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ సీజన్ 2 ద్వారా ఇంకోసారి ఫాన్స్ ని, ఆడియన్స్ ని తనదైన స్టయిల్లో ఎంటర్టైన్ చేయడానికి రెడీ ఐపోతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త షోస్‌ను లాంచ్ చేసే ఆహా , ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 2’ కోసం టైటిల్ సాంగ్ ను రీసెంట్ గా రిలీజ్ చేసింది.
"నేను దిగనంత వరకే" అనే డైలాగ్‌తో స్టార్ట్ అవుతుంది ఈ సాంగ్. మాస్ ఆడియన్స్ మదిని దోచేలా ఉంది ఈ సాంగ్. అన్‌స్టాపబుల్ సీజన్ 1 ఎంత సంచలనం రేకెత్తించిందో అందరికీ తెలుసు. ఇక ఇప్పుడు సీజన్ 2 అక్టోబర్ లో ప్రసారం కావడానికి సిద్ధంగా ఉంది. అందుకు ముందుగా అన్‌స్టాపబుల్ యాంథమ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌ను రోల్ రైడా, మహతి స్వర సాగర్ రూపొందించారు. బాలకృష్ణను సరికొత్త కోణంలో ఎలివేట్ చేయనుంది సీజన్ 2 ..దీంతో సీజన్ 2పై భారీగా ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇండస్ట్రీలోని టాప్ యాక్టర్స్ అంతా ఈ షోలో పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.