English | Telugu

బిగ్ బాస్ షో ఫెయిర్ గా లేదు...కొంతమందినే బాగా హైలైట్ చేస్తున్నారు..నేహా షాకింగ్ కామెంట్స్

బిగ్ బాస్ షో మొదలైన దగ్గర నుంచి వివాదాలను ఎదుర్కుంటూ ఉంది. హౌస్ మేట్స్ ఎలిమినేట్ అయ్యాక బయటికి వచ్చి షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఆ షోని తిట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఇక ఇప్పుడు నేహా చౌదరి కూడా ఒక ఇంటర్వ్యూలో అలాంటి కామెంట్స్ చేసింది. " నేను బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయ్యానంటే చాలామంది నమ్మలేకపొతున్నారు. బిగ్ బాస్ హౌస్ లో కంటెంట్ ఇవ్వని వాళ్లు కూడా ఉన్నారు కానీ వాళ్ళ పేర్లైతే నేను చెప్పను. వాసంతి కేవలం గ్లామర్ డాల్ గా బిగ్ బాస్ హౌస్ లో ఉంది.

నావరకు నేను నిజంగా తప్పు చేసుంటే దాన్ని ఎపిసోడ్ లో ఎందుకు హైలెట్ చేయలేదని ప్రశ్నించింది. ఇనయా గురించి బిగ్ బాస్ హౌస్ లో చాలామంది రాంగ్ గా మాట్లాడారు. ఐతే వీకెండ్ లో నాగార్జున గారు వచ్చి నా వెర్షన్ మొత్తాన్ని రివర్స్ చేసేసారు. ఈ షోకి సంబంధించినంత వరకు నాగార్జున గారు ఫెయిర్ గా లేరనే టాక్ నడుస్తోంది ..కానీ దీనిపై ఇంకేమీ మాట్లాడను. చెప్పాలంటే నాగార్జున గారు ఒకరిద్దరు కంటెస్టెంట్లను మాత్రమే కావాలని హైలెట్ చేస్తున్నారనే విషయం అందరికీ అర్ధమైపోతుంది. నాగార్జున గారికి ఆర్జీవీ గారికి మంచి ఫ్రెండ్షిప్ ఉన్నందువల్లనే ఇనయా హౌస్ లో కొనసాగుతోంది. ఆర్జీవీ గారు ఇనయాను సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేసరికి ఆమె సేవ్ అయ్యింది" అంటూ నేహా చౌదరి ఎన్నో విషయాలను చెప్పుకొచ్చింది.