English | Telugu

'మనది మామూలు ప్రేమ కాదు.. అగ్నిలాగా స్వచ్ఛమైనది'!

'బిగ్ బాస్' ఇరవై నాల్గవ రోజు 'నాది న‌క్కిలీసు గొలుసు' పాటతో మొదలైంది. ఒక్కొక్కరుగా 'బిబి హోటల్ వర్సెస్ హోటల్ గ్లాంప్ ప్యారడైజ్' టాస్క్ లో పర్ఫామెన్స్ పరంగా ఒక్కో కంటెస్టెంట్ ఒక్కోలా నటిస్తూ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. నటించడం అనడం కంటే జీవించడం అనడం కరెక్ట్. ఎందుకంటే గతం మర్చిపోయిన వాడిలా సూర్యని నటించమన్నాడు 'బిగ్ బాస్'. దీంతో రోజు రోజుకి 'సూర్య' తన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంటున్నాడు.

నిన్న జరిగిన టాస్క్ లో భాగంగా 'గజిని' గెటప్ వేసుకున్నాడు. ఎలా అంటే ఒళ్ళంతా పేర్లు రాసుకొని అరుస్తూ, అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. ఇక 'ఇనయా' ఇదే సరైన సమయం అని తన పర్ఫామెన్స్ మొదలుపెట్టింది. సూర్య దగ్గరగా వచ్చి పక్కన కూర్చొని కళ్ళలో చూస్తూ 'నీకు గుర్తుందా, మనం ఇక్కడే కూర్చున్నాం, ఇక్కడ కబుర్లు చెప్పుకున్నాం. ఇన్ని రోజులు మనం ఒకరికొకరం గాఢంగా ప్రేమించుకున్నాం. అప్పుడే మర్చిపోయావా?' అంటూ పాత్రలో లీనమైపోయింది.

ఒక్క క్షణం ఈ సీన్ చూసిన ప్రేక్షకులు ఇనయా నిజంగానే అంటుందా అన్నట్లుగా నటించేసింది. ఇనయా అలా అనేసరికి సూర్యకి ఏమి అనాలో తోచక కాసేపు ఆలోచించుకొని మళ్ళీ కమల్ హసన్ నటించిన 'గుణ' మూవీలోని హీరో పాత్రలోకి దూరిపోయాడు. "మనుషులు అర్థం చేసుకోవడానికి మనది మామూలు ప్రేమ‌ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది" అంటూ ఓ రేంజ్ లో చెలరేగిపోయాడు.

వీళ్ళిద్దరు చేసిన పర్ఫామెన్స్ 'బిగ్ బాస్ హౌస్' కే అద్భుతమైన సన్నివేశంగా మిగిలిపోతుంది అని 'బిగ్ బాస్' ప్రేక్షకులు అనుకుంటున్నారు. అయితే ఈ 'హోటల్ వర్సెస్ హోటల్ టాస్క్' లో పర్ఫామెన్స్ తో పాటు 'టాస్క్' ముగిసే సమయానికి ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయో వారే కెప్టెన్సీ పోటీకి అర్హతను సాధిస్తారు. మరి వీరిద్దరూ డబ్బులు కూడా సంపాదించి కెప్టెన్సీ పోటీదారుల రేస్ లో నిలుస్తారో లేదో చూడాలి మరి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.