English | Telugu
ఆయనతో నటించాలనే కోరిక అలాగే ఉండిపోయింది!
Updated : Sep 30, 2022
టాలీవుడ్ లో టాప్ హీరోస్ తో కలిసి నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది గీత. ఇక ఇప్పుడు ఈమె ఆలీతో సరదాగా షో ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చి ఫాన్స్ తో ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన ఆల్ టైం ఫేవరేట్ అని కానీ ఒక కోరిక మిగిలిపోయిందని అదే ఆయనతో నటించలేకపోవడమే అని ఆమె బాధపడ్డారు.
ఆయనతో కలిసి ఒక్క మూవీలో ఐనా నటించాలనుందని ఆమె అన్నారు. ఇక ఈమె తన చిన్ననాటి సంగతులను కూడా గుర్తు చేసుకుని నవ్వుకున్నారు. ఒకరోజు స్కూల్లో ఫ్రెండ్స్ తో కలిసి జారుడు బల్ల ఆడుకుంటూ ఇంటికి ఆలస్యంగా వెళ్లేసరికి తన తండ్రి బెల్టుతో చితక్కొట్టారంటూ చెప్పారు. ఇక స్కూల్లో టాప్ ర్యాంకర్స్ తోనే ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసేవారట గీత ఎందుకంటే అసలే చదువులో వీక్ కాబట్టి వాళ్ళతో స్నేహం చేస్తే బిట్స్ అవి చూసి కాపీ కొట్టడానికి మంచి అవకాశం దొరుకుతుంది కదా అంటూ నవ్వుతూ చెప్పింది గీత. తాను చదువుకున్నది జస్ట్ 8th క్లాస్ మాత్రమే అని చెప్పారు.
వెంటనే ఇండస్ట్రీలోకి వచ్చేశానన్నారు. భైరవి సినిమా తర్వాత కృష్ణంరాజు గారు నటించిన మన ఊరి పాండవులు సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు ఇది తనకు రెండవ సినిమా అని అన్నారు. ఇలా గీత తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.