English | Telugu

Bigg Boss 9 Telugu:ఓటింగ్ లో తనూజ టాప్.. డేంజర్ జోన్ లో ఆ ముగ్గురు!

బిగ్ బాస్ సీజన్-9 అయిదో వారం క్రేజీగా సాగుతుంది. కంటెస్టెంట్స్ తమ సత్తా చాటుతూ బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తున్నారు. గతవారం వరకు వీక్ అనుకున్న కంటెస్టెంట్స్ అంతా అయిదో వారం చెలరేగిపోతున్నారు. ఇమ్మ్యూనిటీ పొందాలని టాస్క్ లలో తమ సత్తా చాటుతున్నారు.

హౌస్ లో కంటెస్టెంట్స్ ఆటతీరుని చూసిన ఆడియన్స్ అదే రేంజ్ లో ఓటింగ్ వేస్తున్నారు. హౌస్ లో నిన్న జరిగిన టాస్క్ లో బాగా ఆడినవారికి ఓటింగ్ పెరిగింది. అయిదో వారం పవన్ కళ్యాణ్, డిమోన్ పవన్, తనూజ పుట్టస్వామి, సంజన గల్రానీ, ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి, భరణి శంకర్, సుమన్ శెట్టి, దమ్ము శ్రీజ, దివ్య నిఖితలు నామినేషన్స్‌లో ఉన్నారు. కెప్టెన్ రాము రాథోడ్, ఇమ్మాన్యుయల్ తప్పించి మొత్తం పది మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్‌ లో ఉన్నారు.

ఇక అనఫీషియల్ వోటింగ్ ప్రకారం తనూజ 19.44 శాతం ఓటింగ్ తో నెంబర్ వన్ గా నిలిచింది. గత వారం రీతూ చౌదరి వెన్నుపోటుతో కెప్టెన్సీ టాస్క్ ఓడిపోయిన పడాల పవన్ కళ్యాణ్ కు కూడా మెరుగైన ఓటింగ్ లభిస్తోంది. నాగార్జున క్లాస్ తీసుకోవడంతో పవన్ ఆటతీరులో చెప్పుకోదగ్గ మార్పులు వచ్చాయి. టాస్క్ లలో మన సైనికుడు అరివీర భయంకరంగా రెచ్చిపోతున్నాడు. తాజా ఓటింగ్ లో 15.82 శాతం ఓటింగ్ తో సెకండ్ ప్లేస్ లో నిలిచాడు. రీతూ చౌదరి, డీమాన్ కి తక్కువ ఓటింగ్ పడుతోంది. అలాగే శ్రీజకి కుడా ఓటింగ్ తక్కువనే ఉంది. స్వల్ప ఓట్ల తేడాతో రీతు చౌదరి, డీమాన్, శ్రీజ లీస్ట్ లో ఉన్నారు. ఈ వారం వీరి ముగ్గురిలో నుండే ఎలిమినేషన్ అనేది ఫిక్స్. మరి వీరిలో ఎవరు వెళ్తారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.