English | Telugu

Jayam serial : హాస్పిటల్ నుండి వీరు తమ్ముడు సూర్య మాయం.. 

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -84 లో......గంగ లోపలికి వెళ్ళగానే వీరుని చూసి షాక్ అవుతుంది. అసలు రుద్ర సర్ శత్రువులతో వీరు సర్ ఎందుకు ఉన్నాడని ఆలోచిస్తుంది. మరొకవైపు పారు, ఇంకా వాళ్ళ అన్నయ్య మేనేజర్ ని కలిసి హాస్పిటల్ లో పని చేసే నర్సులందరిని  లైన్ లో నిల్చొపెట్టమని అడుగుతారు. దానికి అతను సరే అంటాడు. మరొకవైపు పేషెంట్స్ అందరిని రుద్ర చూస్తూ వస్తున్నాడు.. రుద్రని వీరు చూసి తన మనుషులకి ఫోన్ చేసి రుద్ర వస్తున్నాడు. తమ్ముడున్న గది వైపు వస్తున్నాడు.. ఏదైనా చెయ్యండి అని అంటాడు.

ఇక నుంచి ఆటో కాదు టాటూ రాంప్రసాద్ ...

జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఇక ఇందులో రాంప్రసాద్ స్కిట్ వేరే రేంజ్ లో కొత్తగా ఉంది. ఆటో రాంప్రసాద్ పేరు కాస్త ఇప్పుడు టాటూ రాంప్రసాద్ గా మారిపోయింది. ఈ స్కిట్ లో టాటూ వేసి దొరబాబు. "ఇంతకు ముందు అంతా ఆటో రామ్ అనేవాళ్ళు ఈ షాప్ పెట్టిన దగ్గర నుంచి టాటూ రామ్ అంటున్నారు" అంటూ రాంప్రసాద్ చెప్పుకున్నాడు. "మా దగ్గర ఒకసారి వేయించుకుంటే ఇంకోసారి ఫ్రీగా వేస్తాం" అంటూ చెప్పాడు దొరబాబు. ఇంతలో చలాకి చంటి తన వైఫ్ ని తెచ్చి "నా భార్య బొడ్డు మీద నీ పేరు రాయడమేంట్రా" అని అడిగాడు. మాములుగా టాటూ వేస్తుంటే నాకు కనెక్ట్ అయిందేమో అనుకుని నా పేరు వేసేసా అని చెప్పి దొరబాబు అందరినీ నవ్వించాడు.

వైరల్ అవుతున్న ముమైత్ చేతి గోరింటాకు..ఫ్యూచర్ లో మంచి భర్త వస్తాడంటూ నెటిజన్ కామెంట్

ఇప్పటికింకా నా వయసు నిండా 16 అనే సాంగ్ తో ముమైత్ ఖాన్ ఎంత సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలుసు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఐటెం సాంగ్స్ తో ఉర్రూతలూగించింది ఈ అమ్మడు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఆమె హవా తగ్గిపోయింది. దాంతో అప్పుడప్పుడు బుల్లితెర మీద కనిపిస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. కొంత కాలం క్రితం ప్రసారమైన ఓంకార్ డాన్స్ షో "డాన్స్ ఐకాన్ సీజన్ 2 తో ఒక మెంటార్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది. సోషల్ మీడియాలో ఆమె ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయ్యింది. రకరకాల వీడియోస్ ని రీల్స్ ని పోస్ట్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఆమె ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పెట్టింది. అలాగే ఒక రూమి కవితను కూడా పెట్టింది. "ఒంటరిగా ఉన్నానని ఫీలవకు, విశ్వమంతా నీలోనే ఉంది. నిన్ను నువ్వు చిన్నతనంగా చూసుకోవడం మానెయ్. ప్రేమ పారవశ్యంతో కదులుతున్న విశ్వం నువ్వే.

రొమాంటిక్ ఆంధ్ర మగాడు..ఇది ఫ్యామిలీ షోనే  కదా...

జయమ్ము నిశ్చయమ్మురా ప్రతీ వారం లాగే ఈ వారం కూడా కలర్ ఫుల్ ప్రోమో వచ్చేసింది. ఈ ఎపిసోడ్ కి ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని రాబోతున్నాడు. ఆర్ ఏ ఎం అంటే రామ్ కాదు రొమాంటిక్ ఆంధ్ర మగాడు అంటూ సరికొత్త నిర్వచనంతో జగపతి బాబు రామ్ ని ఇన్వైట్ చేశారు. "హౌ ఓల్డ్ ఆర్ యు" అనేసరికి 11 అన్నాడు రామ్. "14 ఐనా పర్లేదు మీసాలు పెంచేయి అన్నారు" అంటూ రామ్ అన్నాడు. "పెరిగాయా అప్పుడు మీసాలు వచ్చేసాయా" అంటూ అనుమానంగా అడిగారు జగపతి బాబు. "మరి తెలంగాణా క్వీన్ ఎవరు" అంటూ అడిగారు జగ్గు భాయ్. "నేను అలా డైవర్ట్ చేద్దామని చూస్తున్నా" అన్నాడు రామ్. "రొమాన్స్ ఎలా ఫిట్ అవుతుంది నీ లైఫ్ లో " అని జగ్గు భాయ్ అడిగారు.