English | Telugu

Karthika Deepam2 : జ్యోత్స్నకి‌ డౌట్ క్రియేట్ చేసిన దాస్.. వాళ్ళిద్దరు కలుస్తారా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -483 లో..... అసలు మీరు ఇంకా ఎందుకు ఆ ఇంట్లో పని చేస్తున్నారని అడిగితే మొన్నటి దాకా దీప కోసం అన్నావ్ ఇప్పుడేమో అన్నయ్య కూతురు కోసం అంటున్నావ్.. నాకేం అర్థం కావడం లేదని కార్తీక్ తో కాంచన అంటుంది. నాకు కార్తీక్ పై నమ్మకం ఉందని అనసూయ అంటుంది. ఆ తర్వాత దీపతో కార్తీక్ మాట్లాడుతాడు

నువ్వు ఇలా ఉండకు జ్యోత్స్న.. ఏం అన్నా కూడా మాటకి మాట సమాధానం చెప్పమని దీపతో కార్తీక్ అంటాడు. మరుసటి రోజు దీప హుషారుగా పనులు చేస్తు గుడ్ మార్నింగ్ అమ్మయి గారు అని దీప అంటుంది. బావ రాలేదా అని జ్యోత్స్న అడుగుతుంది. వచ్చాడు కిందున్నాడని దీప అంటుంది. నిన్న బావ ఎందుకు అలా అన్నాడు.. నా కోసం మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముందని అడుగుతుంది. మీ కోసమని ఎవరు అన్నారు.. సుమిత్ర అమ్మ కూతురు కోసమని దీప అనగానే అప్పడే పారిజాతం ఎంట్రీ ఇచ్చి సుమిత్ర కూతురు జ్యోత్స్ననే కదా అని అంటుంది. ఏమో అని దీప వాళ్ళని కన్ఫ్యూషన్ చేస్తూ మాట్లాడుతుంది. దాని మాటలు పట్టించుకోకు నువ్వు ఆఫీస్ కి వెళ్ళు.. నేను గుడికి వెళ్తానని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. ఆఫీస్ కి కాదు నీ కొడుకు దగ్గరికి వెళ్తానని జ్యోత్స్న అనుకుంటుంది. కాసేపటికి దాస్ దగ్గరకి జ్యోత్స్న వెళ్తుంది. నువ్వు దీపకి నిజం చెప్పవా అని అడుగుతుంది.‌ లేదు నేను చెప్పకుంటే ఎవరు చెప్పరా.. నాలాగే ఎవరైనా జరిగింది చూశారేమో చెప్పి ఉంటారేమోనని దాస్ అంటుంటే జ్యోత్స్న టెన్షన్ పడుతుంది.

అదంతా కాశీ చూసి ఏంటి జ్యోత్స్న మా నాన్న దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేస్తుందని అనుకుంటాడు. మరొకవైపు దశరథ్ తో దీప మాట్లాడుతుంది. సుమిత్రని పిలుస్తుంది. సుమిత్ర అమ్మ, మీరు ఇద్దరు కలిసి గుడికి వెళ్ళండి హ్యాపీగా ఉండండి.. నా వల్ల మీరు ఎందుకు దూరంగా ఉంటున్నారని దశరథ్ ని దీప అడుగుతుంది. దశరథ్ కప్ కింద పడేసి దాన్ని ఇప్పుడు అతుకుపెట్టగలవా.. అది అతుకు పెట్టిన కూడా అది అతుకులాగే ఉంటుంది.. నమ్మకం కూడా అంతేనని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతాడు. నేను తప్పు చేసాను నన్ను శిక్ష అనుభవించనివ్వు కానీ నువ్వు చేసింది గుర్తుచెయ్యను అలాగని మర్చిపోనని సుమిత్ర అనగానే.. దీప బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.