English | Telugu
సిడ్నీ నగరంలో అరియానా లొల్లి!
Updated : Jul 22, 2023
అరియానా గ్లోరీ.. ఇప్పుడు ట్రేడింగ్ లో ఉన్న బ్యూటీ. బిగ్ బాస్ తో మంచి క్రేజ్ సంపాదించుకొని సెలబ్రిటీ అయిపోయింది అరియానా.. అరియానా మొదటగా తన కెరీర్ ని కుకింగ్ షోస్ తో మొదలు పెట్టింది. ఆ తర్వాత కామెడీ షోలకి యాంకర్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సెలబ్రిటీలని ఇంటర్వ్యూ చెయ్యడం, అది కాంట్రవర్సిటికీ దారితీయడంతో ఫేమస్ అయింది అరియానా.
స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో ఒక ఇంటర్వ్యూ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. దాంతో అరియానా ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయిందని అనడంలో ఆశ్చర్యం లేదు.అరియానా అలా ఫేమస్ అయి బిగ్ బాస్ లో అవకాశం చేజిక్కించుకుంది. బిగ్ బాస్-4 లో ఎంట్రీ ఇచ్చి.. మేల్ కంటెస్టెంట్స్ తో నువ్వా, నేనా అన్నట్టు ఆర్గుమెంట్ చెయ్యడం వళ్ళ అరియనాలోని మరొక కోణం బయటకు వచ్చింది. అయితే జబర్దస్త్ అవినాష్ తో కలిసి బిగ్ బాస్ హౌస్ లో చేసిన కొన్ని సంభాషణలు జనాలకి బాగా కనెక్ట్ అయ్యేలా చేసాయి. వీళ్ళిద్దరి టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ ప్రేక్షకులకు వినోదాన్ని అందించాయి. అయితే అనుకోకుండా బయటకు వచ్చిన అరియానా చాలా బాధపడింది.
అయితే బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత RGV తో కలిసి జిమ్ లో చేసిన ఇంటర్వ్యూ వైరల్ అయింది. ఆ తర్వాత అరియానా ఫ్యాన్ బేస్ ని పెంచుకుంది. ఇలా అరియనా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. బిగ్ బాస్-5 బజ్ కి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని ఇంటర్వ్యూ చేయడం ద్వారా అరియానా పాపులర్ అయింది. ఇంటర్వ్యూలో అరియానా కంటెస్టెంట్ తో సూటిగా మాట్లాడే తీరు అందరిని ఆకట్టుకుంది.
తాజాగా అరియానా ఆస్ట్రేలియా వెళ్ళింది. అక్కడ తన ఫ్రెండ్ తో కలిసి సిడ్నీలోని వివిధ ప్రాంతాల అందాలని చూపిస్తుంది. కొన్ని ఫొటోస్ ని షేర్ చేస్తు ఫ్యాన్స్ దగ్గరగా ఉంటుంది అరియానా. అయితే సిడ్నీ అందాలతో పాటు తను పొట్టి పొట్టి డ్రెస్ లతో డాన్స్ చేసిన వీడియోని షేర్ చేసింది. తను వాళ్ళ ఫ్రెండ్ కలిసి 'నర్సవెల్లే గండిలోని గంగధారి' పాటకి డ్యాన్స్ చేసిన వీడీయోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా తన అభిమానులు సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు నెగెటివ్ కామెంట్స్ చేయగా, మరికొందరు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.